పది క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:34 PM
మండల కేంద్రం నుంచి కడ్తాల మండల కేంద్రానికి అక్రమంగా తరలిస్తున్న పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు.

యాచారం, జూన్ 7 : మండల కేంద్రం నుంచి కడ్తాల మండల కేంద్రానికి అక్రమంగా తరలిస్తున్న పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు. యాచారం మండల కేం ద్రం నుంచి కడ్తాల మండల కేంద్రానికి ఆటోలో పది క్వింటాళ్ల రేషన్ బి య్యం రవాణా చేస్తుండగా పెట్రోమొబైల్ పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో వారు ఆటోను తనిఖీ చేయగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఈమేరకు బియ్యం తరలిస్తున్న రమేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటనారాయణ తెలిపారు.