Share News

చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

ABN , Publish Date - May 25 , 2024 | 11:49 PM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జూన్‌ 2న వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయేలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
విలేకరులతో మాట్లాడుతున్న మల్లు రవి

ఆమనగల్లు, మే 25: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జూన్‌ 2న వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయేలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో శనివారం మల్లు విలేకరులతో మాట్లాడుతూ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే ఉత్సవాలకు సోనియా గాంధీ హాజరవుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే సభకు కాంగ్రెస్‌ శ్రేణులు, తెలంగాణ ఉద్యమ కారులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంత చేయాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన కుటుంబాలకు, ఉద్యమ కారులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. సామాజిక న్యాయం, సమానత్వం కాంగ్రెస్‌ ధ్యేయమన్నారు. అధికారం పోయిందన్న అక్కస్సుతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రతిదీరాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం నిలిచిపోయిన పనులన్నింటిని తిరిగి చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. డీసీసీ అదికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్‌ రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహ తదితరులు ఉన్నారు.

Updated Date - May 25 , 2024 | 11:49 PM