Share News

పంటల సాగులో మెళకువలు పాటించాలి

ABN , Publish Date - May 29 , 2024 | 11:36 PM

పంటల సాగులో రైతులు తగిన మెళకువలు పాటించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అరుణకుమారి కోరారు. విత్తనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఆమనగల్లు మండలం పోలెపల్లి, రాంనుంతల, శెట్టిపల్లి, నుచ్చు గుట్ట తండా, జంగారెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం విత్తనాల ఎంపిక వానాకాలం పంటల సాగుపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. విత్తనాల ఎంపికపై రైతులకు అవగాహన కల్పించారు.

పంటల సాగులో మెళకువలు పాటించాలి
ఆమనగల్లు: పోలెపల్లిలో అవగాహన ర్యాలీ లో ఏవో అరుణకుమారి

ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి, మే 29: పంటల సాగులో రైతులు తగిన మెళకువలు పాటించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అరుణకుమారి కోరారు. విత్తనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఆమనగల్లు మండలం పోలెపల్లి, రాంనుంతల, శెట్టిపల్లి, నుచ్చు గుట్ట తండా, జంగారెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం విత్తనాల ఎంపిక వానాకాలం పంటల సాగుపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. విత్తనాల ఎంపికపై రైతులకు అవగాహన కల్పించారు. అధీకృత డీలర్ల నుంచి రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి విధిగా రశీదులు పొందాలని ఏవో అరుణకుమారి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు రాణి మీనాక్షి, రైతులు పాల్గొన్నారు. అలాగే కడ్తాల్‌ మండల పరిధిలోని న్యామతాపూర్‌, చల్లంపల్లి, వాసుదేవ్‌పూర్‌, మర్రిపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం-2024 పంటల సాగుపై రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఏవో శ్రీలత పాల్గొని రైతులకు విత్తనాల ఎంపిక, పంటల సాగుపై అవగాహన కల్పించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విధిగా రశీదులు పొందాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో లు వందన, రమణ, అభినవ్‌, కేథార్‌సింగ్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆధునికి సేద్యం రైతులకు లాభదాయకమని ఏవో రాజు అన్నారు. తలకొండపల్లి మండలం చీపునుంతల, ఖానాపూర్‌, చౌదర్‌పల్లి, ఆర్లకుంట, జూలపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల ఎంపికపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులను మోసగిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని రాజు హెచ్చరించారు. అధీకృత డీలర్ల వద్దే రైతులు విత్తనాలు కొనాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్‌, శ్రీనాథ్‌, శిరీష, శ్రీకాంత్‌, అనిత, రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:36 PM