పంటల సాగులో మెళకువలు పాటించాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:16 AM
రైతులు పంటల సాగులో మెళకువలు పాటిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.లక్ష్మయ్య, మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వాణిశ్రీ సూచించారు. గురువారం ఇబ్రంహీపల్లిలో రైతులు సాగు చేసిన కూరగాయలు, కుసుమ పంటలను పరిశీలించి రైతులకు సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించారు.

చేవెళ్ల, జనవరి 11 : రైతులు పంటల సాగులో మెళకువలు పాటిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.లక్ష్మయ్య, మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వాణిశ్రీ సూచించారు. గురువారం ఇబ్రంహీపల్లిలో రైతులు సాగు చేసిన కూరగాయలు, కుసుమ పంటలను పరిశీలించి రైతులకు సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించారు. ఏడీఏ రమాదేవి, ఏవో తులసి, ఏఈవో బాలకృష్ణ, మిర్జగూడ సర్పంచ్ బీమయ్య, రైతులున్నారు.