Share News

సర్పంచ్‌ వీడ్కోలు సభలో గ్రామస్తుల కన్నీరు

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:31 PM

సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో వీడ్కోలు కార్యక్రమంలో ఓ సర్పంచ్‌ సేవలను గుర్తు చేసుకుంటూ గ్రామస్తులు కన్నీటిపర్యంతమై సంఘటన వికారాబాద్‌ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.

 సర్పంచ్‌ వీడ్కోలు సభలో గ్రామస్తుల కన్నీరు
సర్పంచ్‌ కుమారుడితో ఏడుస్తున్న మహిళలు

పరిగి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో వీడ్కోలు కార్యక్రమంలో ఓ సర్పంచ్‌ సేవలను గుర్తు చేసుకుంటూ గ్రామస్తులు కన్నీటిపర్యంతమై సంఘటన వికారాబాద్‌ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. పరిగి మండలం ఇబ్రహీంపూర్‌ సర్పంచ్‌ కమ్మరి నర్సమ్మకు, వార్డు మెంబర్లకు గ్రామస్తులు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించి సన్మానించారు. భావోద్వేగానికి గురైన మహిళలు సర్పంచ్‌ నర్సమ్మను, అమె కుమారుడు బాలయ్యను అక్కున చేర్చుకుని కంటతడిపెట్టారు. సర్పంచ్‌, అమె కొడుకు ఐదేళ్ల పాటు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కంటతడిపెట్టారు. మరిన్ని రోజులు సర్పంచిగా కొనసాగితే బాగుండంటూ బాలయ్యను పట్టుకొని రోదించారు. సర్పంచ్‌ మంచితనాన్ని గుర్తుచేసుకున్నారు. గ్రామస్తుల ఆప్యాయత, కన్నీళ్ల మధ్య వీడ్కోలు సమావేశాన్ని ముగించారు. ఎన్నికల్లో మరోసారీ ఆమెనే సర్పంచ్‌గా గెలిపించుకుంటామని గ్రామస్తులు తదితరులు అన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:31 PM