జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ‘పట్నం’ విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:32 PM
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ఇబ్రహీంపట్నంకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. ఈనెల 3, 4వ తేదీల్లో కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బ్రైట్‌స్టార్ కరాటే అసోసియేషన్, విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 6 : జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ఇబ్రహీంపట్నంకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. ఈనెల 3, 4వ తేదీల్లో కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బ్రైట్‌స్టార్ కరాటే అసోసియేషన్, విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. బొంగులూరు నలంద గ్రామర్ స్కూల్‌కు చెందిన అక్షిత, జ్యోత్స్న, శ్రీనిత్ కుమార్, ఇబ్రహీంపట్నం ఆంగ్లిస్టు హైస్కూల్‌కు చెందిన సాత్విక్, ప్రియాంక హైస్కూల్‌కు చెందిన గీతేశ్వర్, శ్రీచైతన్య స్కూల్‌కు చెందిన శ్రీహర్షరెడ్డిలు గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించినట్లు కరాటే మాస్టర్ యు.శ్రీనివాస్ తెలిపారు.
క్రీడలతో ఆరోగ్యానికి ఎంతో మేలు
మొయునాబాద్ రూరల్ : క్రీడలతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని మాస్టర్ మైండ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ బండరి మంజుల అన్నారు. మండల పరిధిలోని మొయిబాద్‌లోని మాస్టర్ మైండ్స్ పాఠశాలకు చెందిన విద్యార్థిని టి.మధు నగరంలో నిర్వహించిన ఇంటర్‌నేషనల్ కరాటే చాంపియన్‌షిప్(ఆల్‌స్టైల్) పోటీల్లో జిల్లా స్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ బృందంతో కలిసి సన్మానించి అభినందించారు. అనంతరం మధు తల్లిదండ్రులను సన్మానించారు. పాఠశాల డైరెక్టర్లు రవియాదవ్, రమేష్‌యాదవ్, ధరణికుమార్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
పరుగు పందెంలో కొత్తపేట విద్యార్థినుల ప్రతిభ
కేశంపేట : హైదరాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో భాగంగా సబ్ జూనియర్ అథ్లెటిక్ మీట్‌లో కేశంపేట మండలం కొత్తపేట జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మంగళవారం నిర్వహించిన 400 మీటర్ల పరుగు పందెంలో 7వ తరగతి విద్యార్థినులు స్పందన రెండో బహుమతి, సుప్రియ మూడవ బహుమతి సాధించారు. విద్యార్థినీలతో పాటు పీఈటీ శిరీషలను హెచ్‌ఎం చంద్రశేఖర్, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు శ్రీనివాససాగర్ అభినందించారు.