Share News

జానపద కళాకారుడికి సూర్యపర్వ్‌ అవార్డు

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:07 AM

కొడంగల్‌ మండలంలోని చిట్లపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు ప్రకాశ్‌ను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సెంట్రల్‌ కల్చరల్‌ టీం లీడర్‌గా ఎంపిక చేసింది.

జానపద కళాకారుడికి సూర్యపర్వ్‌ అవార్డు
అయోధ్యలో సూర్యపర్వ్‌ అవార్డు అందుకుంటున్న జానపద కళాకారుడు ప్రకాశ్‌

కొడంగల్‌ రూరల్‌, మార్చి 21: కొడంగల్‌ మండలంలోని చిట్లపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు ప్రకాశ్‌ను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సెంట్రల్‌ కల్చరల్‌ టీం లీడర్‌గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో శ్రీసీతారామ సన్నిధిలో సూర్యపర్వ్‌ అవార్డుతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యపర్వ్‌ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 18 రాష్ట్రాల నుంచి 250మంది కళాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కళారీ (కర్రసాము) ప్రదర్శనలో కొడంగల్‌కు చెందిన రమేశ్‌ బృందం పాల్గొనగా జ్ఞాపికలతో సన్మానించినట్లు తెలిపారు. కొడంగల్‌ ప్రాంత జానపద కళాకారుడికి అవార్డుతో సన్మానించడం పట్ల నియోజకవర్గ ప్రజలు అభినందనలు తెలిపారు.

Updated Date - Mar 22 , 2024 | 12:07 AM