Share News

పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు అప్పగింత

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:11 AM

నూతన సాంకేతిక పరిజ్ఞానం(సీఈఐఆర్‌)తో పోగొట్టుకున్న ఫోన్లను వెతికి పట్టుకోవడంలో బషీరాబాద్‌ పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు అప్పగింత
బాధితులకుసెల్‌ఫోన్లు అందజేస్తున్న ఎస్‌ఐ రమేష్‌కుమార్‌

బషీరాబాద్‌, ఏప్రిల్‌ 15: నూతన సాంకేతిక పరిజ్ఞానం(సీఈఐఆర్‌)తో పోగొట్టుకున్న ఫోన్లను వెతికి పట్టుకోవడంలో బషీరాబాద్‌ పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మండలంలోని ఎండీ.తాజొద్దీన్‌, ఈ.నాగరాజు, మాలరవి, దేవరి నితీష్‌, మూడవత్‌ రామునాయక్‌, నరేందర్‌, శ్యాములు ఇటీవల వేర్వేరుచోట్ల తమ ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈమేరకు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఎవరికి వారు తమ ఫోన్లు పోయాయని ఫిర్యాదు చేశారు. వేర్వేరుగా కేసులు నమోదు చేసిన పోలీసులు సెంట్రల్‌ ఎక్వి్‌పమెంట్‌ ఐడెంటింటీ రిజిస్టర్‌ (సీఈఐఆర్‌) అప్లికేషన్‌ ఉపయోగించి పోయిన ఏడుగురి సెల్‌ఫోన్లను వెతికి పట్టుకున్నారు. ఈక్రమంలో ఎస్‌ఐ రమే్‌షకుమార్‌ బాధితులను సోమవారం పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించి ఫోన్లను స్వయంగా అందజేశారు.

Updated Date - Apr 16 , 2024 | 12:11 AM