మహేశ్వరం డీసీపీగా సునీతారెడ్డి
ABN , Publish Date - Jan 09 , 2024 | 11:29 PM
రాచకొండ పరిఽధిలోని మహేశ్వం జోన్ డీసీపీగా డి. డి.సునీతారెడ్డి బాధ్యతలు స్వీకించారు. రాష్ట్ర నార్కోటెక్ డ్రగ్స్ కంట్రోల్ డీసీపీగా విధులు నిర్వహించిన డి.సునీతారెడ్డి బదిలీపై మహేశ్వరానికి వచ్చారు.
మహేశ్వరం, జనవరి 9: రాచకొండ పరిఽధిలోని మహేశ్వం జోన్ డీసీపీగా డి. డి.సునీతారెడ్డి బాధ్యతలు స్వీకించారు. రాష్ట్ర నార్కోటెక్ డ్రగ్స్ కంట్రోల్ డీసీపీగా విధులు నిర్వహించిన డి.సునీతారెడ్డి బదిలీపై మహేశ్వరానికి వచ్చారు. తుక్కుగూడలోని డీసీపీ కార్యాలయంలో మంగళవాం విలేకర్లతో ఆమె మాట్లాడుతూ.. మహేశ్వం జోన్ ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఏసీపీ పరిధుల్లో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషిచేస్తానన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలుకూడా భాగస్వాములు కావాలన్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలను ఎవరు సరఫరా చేసినా వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. సైబర్ నేరాలు, గంజాయి వంటి వాటి నిర్మూలనకు త్వరలో గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజలకు, యువతకు అవగాహన కల్పిస్తామన్నారు.