Share News

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:38 AM

మేడ్చల్‌ పోలీస్టేషన్‌ పరిధి మునీరాబాద్‌ గ్రామంలో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

మేడ్చల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 24 : మేడ్చల్‌ పోలీస్టేషన్‌ పరిధి మునీరాబాద్‌ గ్రామంలో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. శ్రీకాంత్‌(26) అనే వ్యక్తి గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు మంగళవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:38 AM