Share News

విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:55 PM

విద్యార్థులు పాఠశాల స్థాయినుంచే క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని అనురాగ్‌ యూనివర్సిటీ ప్రోగ్రాం ఆఫీసర్‌ మధుకర్‌ తెలిపారు.

విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలి
కొర్రెముల జిల్లా పాఠశాలలో నిర్వహించిన కెరీర్‌ గైడెన్స్‌ పాల్గొన్న అనురాగ్‌ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 5: విద్యార్థులు పాఠశాల స్థాయినుంచే క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని అనురాగ్‌ యూనివర్సిటీ ప్రోగ్రాం ఆఫీసర్‌ మధుకర్‌ తెలిపారు. మండలంలోని వెంకటాపూర్‌ అనురాగ్‌ యూనివర్సిటీ ఎన్‌ఎ్‌సఎ్‌స ఆధ్వర్యంలో కొర్రెముల జిల్లా పరిషత్‌ పాఠశాలలో శుక్రవారం కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు క్విజ్‌ వంటి పోటీపరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనురాగ్‌ యూనివర్సిటీ అధ్యాపకులు తృప్తి, లక్ష్మికాంత్‌రెడ్డి, హెచ్‌ఎం వరలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:55 PM