Share News

ఇంటర్‌ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:45 AM

ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ఈసారి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు సత్తా చాటాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లోనూ వికారాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అగ్రస్థానంలో నిలిచింది. ఈ కళాశాల ప్రథమ సంవత్సరంలో 45.37 శాతం, ద్వితీయలో 66.37 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కళాశాలల్లో మేటిగా నిలిచింది.

ఇంటర్‌ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
తాండూరు : విద్యార్థులను సన్మానిస్తున్న భాష్యం కళాశాల అధ్యాపకులు

సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు

అభినందించిన అధ్యాపకులు, తల్లిదండ్రులు

వికారాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ఈసారి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు సత్తా చాటాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లోనూ వికారాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అగ్రస్థానంలో నిలిచింది. ఈ కళాశాల ప్రథమ సంవత్సరంలో 45.37 శాతం, ద్వితీయలో 66.37 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కళాశాలల్లో మేటిగా నిలిచింది.

వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అగ్రగామిగా నిలిచారని ప్రిన్సిపాల్‌ సురేశ్వర స్వామి తెలిపారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ నుంచి కె. మహలక్ష్మి 966, కె. స్రవంతి 925, బైపీసీలో కె.అంజలి 958, స్పందన 928, జకీయ 912, అయేషా 8877, సీఈసీలో కె.నవనీత 920, అశోక్‌ 886, హెచ్‌ఈసీలో రాఘవేందర్‌ 809, రైసాబేగం 924, మొదటి సంవత్సరంలో మౌనిక 455, సుజాత 430, బైపీసీ నుంచి మనోజ్‌ కుమార్‌ 410, సీఈసీలో కె. అక్షయ 457, హెచ్‌ఈసీలో మహేందర్‌ 425 ఉత్తమ మార్కులు సాధించారని అన్నారు. విద్యార్థులను అధ్యాపకులను అభినందించారు. వికారాబాద్‌ జిల్లాలో వెనుకబడిన తరగతుల వసతి గృహంలో మొదటి సంవత్సరం 266 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 146 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినటట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కె. ఉపేందర్‌ తెలిపారు. వసతి గృహాంలో వారిగా చూసినట్లయితే 55 శాతం ఉత్తీర్ణత సాధించారని, జిల్లా స్థాయిలో 53 శాతం మంది విద్యార్థులు మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం 300 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో 220 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. వసతి గృహాం వారిగా చూసినట్లయితే 73 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత కలిగి ఉన్నారని, అదే విధంగా జిల్లా వారిగా ఇంటర్మీడియట్‌ రెండవ సంవత్సరంలో 61 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత శాతం ఉందని ఆయన పేర్కొన్నారు.

వికాస్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం మాదిరిగానే సీఈసీ , హెచ్‌ఈసీ గ్రూపులతో పాటు ఈ సంవత్సరం బైపీసీలో రికార్డు మార్కులు సాధించారని వికాస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రిన్సిపాల్‌తో పాటు సీనియర్‌ అధ్యాపకులు ప్రభాకర్‌ రెడ్డి, రాంచందర్‌ విద్యార్థులను అభినందించారు. ఏసీఆర్‌ భృంగీ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించడం జరిగిందని కళాశాల కార్యదర్శి ప్రమీల చంద్రశేఖర్‌ అన్నారు. ఎంపీసీ ఇందు 467, బైపీసీలో చందన ప్రీతి 436 మార్కులు సాధించగా ఎంపీసీ ద్వితీయలో అష్వియ 978, బైపీసీలో సాహస్త 966, సీఈసీ ముస్కాన్‌ కాతూన్‌ 964 మార్కులు సాధించడం జరిగిందన్నారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని సంగం లక్ష్మీబాయి గురుకుల కళాశాలలో ప్రిన్సిపల్‌, అధ్యాపకుల కృషి ఫలించి విద్యార్థులు విజయదుందుభి మోగించారని కళాశాల ప్రిన్సిపల్‌ గోపీశెట్టి రమణమ్మ తెలిపారు. ఎంపీసీలో హేమవతి 466 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచిందని, బైపీసీలో సంధ్యారాణి 436 మార్కులు సాధించారన్నారు. బైపీసీ ద్వితీయలో జాహ్నవి 982 మార్కులు సాధించగా.. ఎంపీసీలో అక్షయ 988 మార్కులు సాధించడం జరిగిందన్నారు. అలాగే ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్‌ సురేశ్వర స్వామి తెలిపారు. ఎంపీసీలో డి.మౌనిక 455 మార్కులు, ద్వితీయలో మహలక్ష్మి 966 మార్కులు సాధించి సత్తా చాటారన్నారు. సీఈసీలో దుర్గలక్ష్మి 445లు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. కాగా, వికారాబాద్‌ ఇంటర్‌ ఫలితాల్లో వికారాబాద్‌ సిద్ధార్థ జూనియర్‌ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కె.సాహితి ఎంపీసీలో 990 మార్కులు సాధించారు. బైపీసీలో ఎండీ ముసబ్‌ఖాన్‌కు 988 మార్కులు రాగా, సీఈసీలో ఎండీ ముజై్‌ఫఖాన్‌కు 950 మార్కులు, ఎంఈసీలో టి.నిహారిక 921 మార్కులు వచ్చాయి. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో బి.నితిన్‌కుమార్‌ 463 మార్కులు సాధించగా, బైపీసీలో అఫియా మహాజబీన్‌ 437 మార్కులు, సీఈసీలో సనా అఫ్రీన్‌ 479, ఎంఈసీలో జి.హరిత 489 మార్కులతో టాపర్లుగా నిలిచినట్లు సిద్ధార్థ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.జయదేవ్‌ తెలిపారు.

తాండూరు : ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజి విద్యార్థులు సత్తా చాటారు. తాండూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలో చదువుతున్న విద్యార్థిని సులేమాన్‌ హస్మి ఇంటర్‌ ఫలితాల్లో సెకండ్‌ ఇయర్‌ ఉర్దూ మీడియం నుంచి బైపీసీలో 990 మార్కులు సాధించి తాండూరు టాపర్‌గా నిలిచారు. ప్రభుత్వ కాలేజీ నుంచి విద్యార్థిని ఘనత సాధించడం పట్ల ప్రిన్సిపాల్‌, అఽధ్యాపకులు సులేమాన్‌ హస్మిని అభినందించారు.

తాండూరు రూరల్‌ : మండల పరిధిలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న తెలంగాణ మోడల్‌ స్కూల్‌, కళాశాల కొనసాగుతోంది. మొదటి సంవత్సరంలో 79 మంది విద్యార్థులకుగాను 59 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయలో 77 మంది విద్యార్థులకు గాను 53మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ ప్రకాష్‌గౌడ్‌ తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను 457 మార్కులు నందిని, బిందులకు సాఽధించారు. బైసీసీలో 440 మార్కులకుగాను 414 మార్కులు నిహారిక, శివాణీలు సాధించారన్నారు. అలాగే తెలంగాణ మోడల్‌ స్కూల్లో రెండవ సంవత్సరంలో 77 మంది విద్యార్థులకు గాను 53మంది ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్‌ తెలిపారు. బైపీసీలో అనూషకు 1000 మార్కులకు 958 వచ్చాయన్నారు. ఎంపీసీలో శ్రీవాణికి 1000 మార్కులకు గాను 925 మార్కులు వచ్చాయని తెలిపారు.

బంట్వారం : మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ లో 63 మంది విధ్యార్థులు పరీక్షలు రాయగా.. 14మంది ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపాల్‌ సరళరెడ్డి తెలిపారు. ఎంపీసీలో భానుప్రసాద్‌ 328, బైపీసీలో మహేక్‌ సద్దిక్‌కు 356, ఇంటర్‌ సెకండియర్‌లో 66 మందికిగాను 27 మంది ఉత్తీర్ణులయ్యారు.

మర్పల్లి : మండల పరిధిలోని పంచాలింగాల గ్రామానికి చెందిన పి.అనూష మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ సెకండియర్‌లో 1000 మార్కులకుగాను 959 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది.

పరిగి : పరిగి గ్లోబల్‌ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు ప్రతిభను చాటారు. పరిగి పట్టణానికి చెందిన బెపీసీ సెకండియర్‌లో మహిరా సమర్‌ 988/1000 సాధించారు. ఎంపీసీలో ఎస్‌.సాయికీర్తన 987/1000 సాధించారు. బైిపీసీ ఫస్టియర్‌లో బి.నిహరిక 436/440, ఉజ్మాపాతిమాకు 436/440, ఎంపీసీలో జి.కార్తీక 466/470 మార్కులు సాధించారు. పరిగిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు సెకండ్‌ ఇయర్‌లో 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. 163 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 113 మంతి ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 34 శాతం ఉత్తీర్ణత సాదించారు. 146 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 50 మంది ఉత్తీర్ణత సాధించారు.

పూడూరు : ఇంటర్‌ ఫలితాల్లో పూడూరు మండల విద్యార్థులు సత్తాచాటారు. తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థుల విద్యార్థిని అరుంధతి ఇంటర్‌ ద్వితీయలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. తెలంగాణ మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు.

నవాబుపేట/బొంరా్‌సపేట్‌ : నవాబుపేట మండల కేంద్రంలోని కేజీబీవీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. ఎంపీసీలో ఎం.అనూష 769, బైపీసీలో యం.వైష్ణవి 933, సీఈసీలో బి.మాధవి 787 మార్కులు సాధించి కళాశాల టాపర్‌లుగా నిలిచినట్లు అధ్యాపకులు తెలిపారు. బొంరా్‌సపేట్‌ మండలం లింగన్‌పల్లి గ్రామానికి చెందిన బడెంపల్లి విష్ణు బైపీసీలో 1000 మార్కులకు గాను 940 మార్కులు సాధించాడు.

మోమిన్‌పేట్‌ : ఇంటర్‌ ద్వితీయ పరీక్ష ఫలితాల్లో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. బైపీసీలో లీనాకుమారి 904 మార్కులు, సీఈసీలో వి.రేఖ 904 మార్కులు, యంపీసీలో శ్రీనివా్‌సరెడ్డి 916 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ చెన్నయ్య తెలిపారు.

దోమ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు 98 మంది పరీక్షలు రాయగా 35 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ద్వితీయలో 124 మంది పరీక్షకు హాజరు కాగా 82 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ మంజుల తెలిపారు.

కొడంగల్‌/కొడంగల్‌ రూరల్‌ : ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో కొడంగల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతున్న శివగారి పూజ 958 మార్కులు సాధించింది. హెచ్‌ఈసీ ద్వితీయ సంవత్సరంలో ఎస్‌.రజిత 843, ఎంపీసీలో పి.కృష్ణకుమార్‌ 835, మొదటి సంవత్సరం హెచ్‌ఈసీలో బి.అంజిలయ్య 401, బైపీసీలో కండ్రె అశ్విని 408, యంపీసీలో శివ నర్సింహా 399 మార్కులు సాధించారు. పాత కొడంగల్‌ గిరిజన గురుకుల కళాశాలకు చెందిన 23 మంది సెకండియర్‌ విద్యార్థులకు గాను 14 మంది పాసయ్యారు. ప్రథమ సంవత్సరంలో 24 మంది విద్యార్థులకు గాను 17 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ బల్‌రాం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల అధ్యాపకులు అభినందించారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో..

కీసర రూరల్‌ : నాగారం మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, బహదూర్‌పుర నియోజకవర్గాలకు చెందిన మహాత్మా జ్యోతిబాపూలే కళాశాల విద్యార్థులు ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు 46 మంది రాయగా 43 మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు 43 మంది రాయగా 33మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న నవీన్‌ అనే విద్యార్థి 470 మార్కులకు గాను 465 సాధించాడు. అదే విధంగా సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు పలువురు 900లకు పైగా మార్కులు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్స్‌పాల్లు పీఎన్‌ చారి, అంజన్నలు అభినందించారు.

ఘట్‌కేసర్‌ : ఇంటర్‌ మొదటి, ద్వితియ సంవత్సర ఫలితాల్లో ఘట్‌కేసర్‌లోని రిషీ బాలికల, స్థానిక శ్రీచైతన్య కళాశాల విద్యార్ధులు 80శాతం ఉత్తీర్ణత సాదించారు. బుధవారం వెలువడిన ఇంటర్‌ ఫలితాలలో అత్యధిక మార్కులు సాదించిన విద్యార్ధులను కళాశాల ఆద్యాపకులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఘట్‌కేసర్‌లోని రిషి బాలికల, స్థానిక శ్రీచైతన్య కళాశాలల్లో అత్యధిక మార్కులు సాదించిన విద్యార్ధుల వివరాలీలా ఉన్నాయి.

మేడ్చల్‌ టౌన్‌ : ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో మేడ్చల్‌ విద్యార్ధులు తమ ప్రతిభ చాటుకున్నారు. మేడ్చల్‌ పట్టణంలోని స్ఫూర్తి కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్ధి అర్షియా 986, ఎంపీసీ విద్యార్ధిని లక్ష్మీకచువ 984, బైపీసీ విద్యార్ధిని డి.శ్రీమాన్విథ 984, ఎంపీసీ విద్యార్ధిని వి.వైష్ణ్ణవి 982 మార్కులు సాధించారు. ఇదే కాలేజీకి చెందిన ఫస్టియర్‌ విద్యార్ధిని ఎస్‌.కీర్తన 464, ఎంపీసీ విద్యార్ధి మోహన్‌ 464 మార్కులు సంపాదించారు.

ఘట్‌కేసర్‌ రూరల్‌ : ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో మండలంలోని అవుషాపూర్‌ శ్రీచైతన్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఇంటర్‌ సెకండ్‌ఇయర్‌ పరీక్ష ఫలిత్లాల్లో ఎంపీసీ విభాగానికి చెందిన బొరుగుల మోహన్‌ 1000/ 992 మార్కులు సాధించాడు. హుజూరాబాద్‌ పట్టణంకు చెందిన బొరుగుల మోహన్‌ తండ్రి బొరుగుల రాజయ్య వ్యవసాయం కూలీ. అలాగే ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో ఎంపీసీ విభాగానికి చెందిన మారం సాయిగౌతం470/466 మార్కులు, రేగొటి సాయితేజ ఎంపీసీ మొదటి సంవత్సరం ఫలితాలలో 470/466 మార్కులు సాధించారు. జనగామ జిల్లా, స్టేషన్‌ ఘనాపూర్‌కు చెందిన మారం సాయిగౌతం తండ్రి వినయ్‌కుమార్‌ దినసరి కూలీ, యాదాద్రి-భువనగిరి జిల్లా, అలేరుకు చెందిన రేగొటి సాయితేజ తండ్రి వెంకటేష్‌ సైతం దినసరి కూలీ. ఇంటర్‌ పరీక్ష ఫలితాలలో 98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని శ్రీచైతన్య ప్రిన్సిపల్స్‌ రామకృష్ణ, సుమన్‌, డీన్‌ టీఎ్‌సఅర్‌లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వారు అభినందనలు తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 12:45 AM