కుక్కల దాడిలో విద్యార్థికి గాయాలు
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:40 PM
పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థిపై వీధికుక్కలు దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి.
మర్పల్లి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థిపై వీధికుక్కలు దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పట్లూర్ గ్రామానికి చెందిన అశ్విత్ అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగా శుక్రవారం సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా వీధి కుక్కల గంపు ఒక్కసారిగా అశ్విత్‌పై దాడి చేశాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టి గాయాలపాలైన అశ్విత్‌ను అదే గ్రామంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.