Share News

విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:56 PM

సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన ఓ గిరిజన విద్యార్థిని విద్యాఘాతానికి గురై మృతి చెందింది. మండలంలోని హర్యనాయక్‌ తండాలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..

విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి

సంపు మోటారు ఆన్‌ చేస్తుండగా ఘటన

సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చి, తిరిగిరాని లోకానికి..

తలకొండపల్ల్లి, జనవరి 12: సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన ఓ గిరిజన విద్యార్థిని విద్యాఘాతానికి గురై మృతి చెందింది. మండలంలోని హర్యనాయక్‌ తండాలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హర్యనాయక్‌ తండాకు చెందిన మూడావత్‌ శంకర్‌-శాంతి దంపతుల కూతురు నందిని(13) తలకొండపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ(గిరిజన)లో 8వ తరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నందిని గురువారం హర్యనాయక్‌ తండా కు వచ్చింది. కాగా, నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద సంపు మోటార్‌ను ఆన్‌చేసే క్రమంలో పక్కన తేలివున్న కేబుల్‌ వైరు నందినికి తాకడంతో వి ద్యుత్‌ ప్రమాదానికి గురైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను స్థానికం గా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంక్రాంతి వేళ ఇంటికి వచ్చిన విద్యార్థిని కానరాని లోకాలకు వెళ్లడంతో హర్యనాయక్‌ తండాలో విషాదం చోటుచేసుకుంది.

పరిశ్రమలో కార్మికుడు..

షాద్‌నగర్‌, జనవరి 12: విద్యుదాఘాతంతో పరిశ్రమలో కార్మికుడు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని అన్నారంలో శుక్రవారం జరిగింది. నందిగామ మండల కేంద్రానికి చెందిన అంజిరెడ్డి, అన్నారంలోని జంటెక్‌ బాల్మిల్‌ పరిశ్రమలో కొంతకాలం నుంచి పనిచేస్తున్నాడు. శుక్రవారం పరిశ్రమలో పని చేస్తుండగా, విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. అంజిరెడ్డి మృతదేహాన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. కాగా, కార్మికుడి మృతిపట్ల పరిశ్రమ యాజమాన్యం స్పందించడం లేదని సమాచారం.

Updated Date - Jan 12 , 2024 | 11:56 PM