నెంబర్ ప్లేట్లు మారిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:54 PM
నెంబర్ ప్లేట్లు మార్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ ఏసీపీ వెంకట్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ పోలీస్టేషన్‌లో శుక్రవారం నెంబర్ ప్లేట్లు మార్చి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు

మేడ్చల్ టౌన్, జూన్ 7: నెంబర్ ప్లేట్లు మార్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ ఏసీపీ వెంకట్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ పోలీస్టేషన్‌లో శుక్రవారం నెంబర్ ప్లేట్లు మార్చి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో కేటాయించిన నెంబర్‌ను మార్చడం, లేక అర్థమవకుండా రాయించడం చట్టరీత్యా నేరమన్నారు. వాహనాల నెంబర్లు మార్చితే అలాంటి వాహనాలను సీజ్ చేయటంతో పాటు సదరు వాహన యజమానులపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీఒక్కరు ట్రాఫిక్ నిబంధనలకు లోబడి వాహనాలు నడపాలని కోరారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినా, హెల్మెట్ ధరించకున్నా, రాంగ్ రూట్‌లో వాహనం నడిపినా, నిషేధిత ప్రాంతాల్లో వాహనాలను పార్కింగ్ చేసినా, శబ్ద కాలుష్యాన్పి పెంపొందించే విధంగా సైలెన్సర్లను అమర్చినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నందున చాలా మంది రాంగ్‌రూట్‌లో రహదారిపై ప్రయాణించి ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. యూటర్న్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి రోడ్డు దాటాలని వాహన దారులకు సూచించారు. ప్రతీ వాహన దారుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని ఏసీపీ కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ట్రాఫిక్ సీఐ హనుమాన్ గౌడ్ పాల్గొన్నారు.