Share News

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 31 , 2024 | 12:14 AM

నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసగిస్తే ఎంతటి వారైన కఠిన చర్యలు తప్పవని ఆమనగల్లు మండ వ్యవసాయశాఖ అధికారిణి అరుణకుమారి కోరారు. విత్తనాల ఎంపిక రైతులు తగిన మెళకువలు పాటించాలని ఆమె కోరారు. ఆమనగల్లు మండలం సంకటోనిపల్లి, ఆమనగల్లు, సింగంపల్లి, ఆకుతోటపల్లి గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఏవో అరుణకుమారి విత్తనాల ఎంపిక, ఆదునిక సేద్యంపై రైతులకు అవగాహన కల్పించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
తలకొండపల్లి : రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు

మండల వ్యవసాయశాఖ అధికారులు

విత్తనాల కొనుగోలుపై రైతులకు అవగాహన

ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి, మే 30: నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసగిస్తే ఎంతటి వారైన కఠిన చర్యలు తప్పవని ఆమనగల్లు మండ వ్యవసాయశాఖ అధికారిణి అరుణకుమారి కోరారు. విత్తనాల ఎంపిక రైతులు తగిన మెళకువలు పాటించాలని ఆమె కోరారు. ఆమనగల్లు మండలం సంకటోనిపల్లి, ఆమనగల్లు, సింగంపల్లి, ఆకుతోటపల్లి గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఏవో అరుణకుమారి విత్తనాల ఎంపిక, ఆదునిక సేద్యంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు విధిగా రశీదులు పొందాలన్నారు. డీలర్లు ఈ-పాస్‌ ద్వారానే ఎరువులు విక్రయించాలని మె సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో మీనాక్షి, రాణి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. రైతులు అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారిణి శ్రీలత కోరారు. కొనుగోలు చేసిన విత్తనాలకు విదిగా రశీదులు పొంది పంట దిగబడి వరకు భద్రపరుచుకోవాలని ఆమె సూచించారు. కడ్తాల మండలం రావిచెడ్‌, ముద్విన్‌, అన్మా్‌సపల్లి, సాలార్‌పూర్‌ గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం పంటల సాగుపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏవో శ్రీలత విత్తనాల ఎంపికై రైతులకు అవగాహన కల్పించారు. లూజు సంచుల్లో ఉన్న విత్తనాలు కొనుగోలు చేయకూడదని కొనుగోలు చేసిన విత్తనాలకు రశీదులు పొందాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు రమణ, వందన, అభినవ్‌, కేథారిసింగ్‌, ఎంపీటీసీలు గోపాల్‌, ప్రియరమేశ్‌, నిర్మలాదేవి, నాయకులు శంకర్‌, యాదయ్య, విఠలయ్యగౌడ్‌, శ్రీనివా్‌స్‌ , రైతులు తదితరులు పాల్గొన్నారు. తలకొండపల్లి మండల పరిధిలోని వీరన్నపల్లి, లింగరావుపల్లి, చంద్రధన పూల్‌సింగ్‌ తండా చెన్నంపల్లి గ్రామాలలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏవో రాజు పాల్గొని విత్తనాల ఎంపిక వానాకాలం పంటల సాగు పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు విజయ్‌, శ్రీనాథ్‌, శ్రీకాంత్‌, అనిత, నిఖిత, శిరీష , రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఈ-పాస్‌ ద్వారానే ఎరువులు విక్రయించాలి

ఈ-పాస్‌ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలని ఏవో శ్రీలత కోరారు. ఎమ్మార్పీ ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలని ఆమె సూచించారు. కడ్తాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో విత్తన దుకాణాలను గురువారం ఏవో శ్రీలత తనిఖీ చేశారు. ఆయా దుకాణాల రికార్డుల, ఎరువుల, విత్తనాల నిల్వలను పరిశీలించారు. విత్తనాలువిక్రయించిన ప్పుడు రైతులకు తప్పని సరిగా రశీదులు ఇవ్వాలని డీలర్లకు సూచించారు. రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు విధిగా రశీదులు తీసుకోవాలని ఆమె సూచించారు. దుకాణాల ఎదుట ధరల పట్టిక ఎరువుల నిల్వలను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

విత్తనాలు,ఎరువులు కొంటే రసీదు తప్పనిసరి

చౌదరిగూడ : రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రసీదు తప్పనిసరి తీసుకోవాలని మండల వ్యవసాయ విస్తరణాధికారులు గౌరిప్రియ, స్వాతి రాజేశ్వరిలు సూచించారు. గురువారం జిల్లేడ్‌ చౌదరిగూడ మండల పరిధిలోని ఎదిర, గుర్రంపల్లి, జిల్లేడ్‌, పెద్ద ఎల్కిచర్ల, గాలిగూడ, ముష్టిపల్లి, రావిర్యాల, కాస్లాబాద్‌ గ్రామాల్లో విత్తనాల కొనుగోలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తీసుకున్న రసీదు పంట దిగుబడి చేతికొచ్చే వరకు భద్రపరుచుకోవాలన్నారు. నాణ్యమైన విత్తనాలు వాడి ఆధిక దిగుబడులు పొందాలని రైతులకు సూచించారు. పంటల సాగుబడిపై ఎలాంటి సందేహాలున్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు. ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 12:14 AM