Share News

వీధి నాటకాలు చరిత్రను గుర్తుచేస్తాయి

ABN , Publish Date - May 25 , 2024 | 11:48 PM

వీధి నాటకాలు చరిత్రను గుర్తుచేస్తాయని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. చౌడాపూర్‌ మండల కేంద్రంలో శ్రీ భక్తశిరియాల వీధినాటకం శుక్రవారం రాత్రి ప్రారంభమైంది.

వీధి నాటకాలు చరిత్రను గుర్తుచేస్తాయి
చౌడాపూర్‌లో వీధి నాటకంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

కులకచర్ల, మే 25: వీధి నాటకాలు చరిత్రను గుర్తుచేస్తాయని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. చౌడాపూర్‌ మండల కేంద్రంలో శ్రీ భక్తశిరియాల వీధినాటకం శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే పాల్గొని నాటకంలో పాత్రధారులు, కళాకారులను సన్మానించారు. గ్రామాల్లో నాటకాలు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీమ్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అశోక్‌కుమార్‌, చౌడాపూర్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు యాదయ్య, మండల ఉపాధ్యక్షుడు రాములు, వెంకట్‌, ఆంజనేయులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 11:48 PM