Share News

నిలిచిపోయిన భగీరథ నీటి సరఫరా త్వరలో ప్రారంభం

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:00 AM

కొత్తూర్‌, నందిగామ మండలాల్లో రోడ్డు విస్తరణ పనుల కారణంగా పైపులైన్లు ధ్వంసం కావడం వల్ల పలు గ్రామాలకు నిలిచిపోయిన మిషన్‌ భగీరథ నీటి సరఫరాను త్వరలో ప్రారంభిస్తామని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు.

నిలిచిపోయిన భగీరథ నీటి సరఫరా త్వరలో ప్రారంభం
కొత్తూర్‌లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ మరమ్మత్తులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

- ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

కొత్తూర్‌, ఫిబ్రవరి 19 : కొత్తూర్‌, నందిగామ మండలాల్లో రోడ్డు విస్తరణ పనుల కారణంగా పైపులైన్లు ధ్వంసం కావడం వల్ల పలు గ్రామాలకు నిలిచిపోయిన మిషన్‌ భగీరథ నీటి సరఫరాను త్వరలో ప్రారంభిస్తామని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ఈ మండలాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరా అలసత్వంపై ఇటీవల షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అసెంబ్లీలో ప్రస్తావించగా ప్రభుత్వం వెంటనే స్పందించి, సంబంధిత శాఖ అధికారులను అదేశించింది. దీంతో మిషన్‌ భగీరథ సిబ్బంది ఐడీఏ సమీపంలో పాత జాతీయ రహదారి ప్రక్కన మరమ్మత్తులను ప్రారంభించారు. ఈ పనులను సోమవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల్లో నీటి సరఫరా ప్రారంభమవుతుందన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గొంగళ్ల హరినాథ్‌రెడ్డి, బాబర్‌ఖాన్‌ ఉన్నారు.

స్వయం కృషితో ఎదగాలి

యువత స్వయం కృషితో ఎదగాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. మండలంలోని పెంజర్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప గ్లాస్‌, అల్యూమినియం సామాగ్రి దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా దుకాణం యాజమాని శ్రీధర్‌ను ఎమ్మెల్యే అభినందించారు. మాజీ జడ్పీటీసీ మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీటీసీలు రవీందర్‌రెడ్డి, కొమ్ము కృష్ణ, నాయకులు మామిడి జనార్ధన్‌రెడ్డి, సుదర్శన్‌గౌడ్‌, శంకరయ్య, పాముల రమేష్‌, కుమ్మరి రమేష్‌, ఎర్రోళ్ల జగన్‌, తేజేశ్వర్‌, అనిల్‌, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:00 AM