Share News

బీఆర్‌ఎ్‌సలో చీలికలు.. కాంగ్రె్‌సలో చేరికలు!

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:02 AM

మహేశ్వరం నియోజకవర్గ బీఆర్‌ఎ్‌స చీలికలు, పేలికలుగా మారుతోంది. పాలక కాంగ్రె్‌స పార్టీలోకి చేరికలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి.

బీఆర్‌ఎ్‌సలో చీలికలు.. కాంగ్రె్‌సలో చేరికలు!
నాగారం మాజీ సర్పంచ్‌ రాములునాయక్‌కు కండువా కప్పుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(ఫైల్‌)

మహేశ్వరంలో హస్తం కళకళ.. కారు వెలవెల!

మహేశ్వరం, ఏప్రిల్‌ 7 : మహేశ్వరం నియోజకవర్గ బీఆర్‌ఎ్‌స చీలికలు, పేలికలుగా మారుతోంది. పాలక కాంగ్రె్‌స పార్టీలోకి చేరికలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు మహేశ్వరం జడ్పీటీసీ, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి ఇప్పటికే కాంగ్రె్‌సలో చేరి వారి అనుచరులనూ చేర్చుకోవడంలో బిజీబిజీగా ఉన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం కాంగ్రె్‌సలో చేరి ఇదే పార్టీ టికెట్‌ పొందడంతో ఎంపీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వెయ్యి ఏనుగుల బలాన్ని సంతరించుకుంది. మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతి నిధులు హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు. కందుకూరు బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ జంగారెడ్డి, తుక్కుగూడ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ భవానీవెం కట్‌రెడ్డి, కౌన్సిలర్‌ తేజశ్వినిశ్రీకాంత్‌, మహేశ్వరం ఇన్‌చార్జి ఎంపీపీ ఆర్‌.సునీతఅంద్యానాయక్‌, తుమ్మలూరు మాజీ సర్పంచ్‌లు ఎం.సురేఖకరుణాకర్‌రెడ్డి దంపతులు, నాగారం మాజీ సర్పంచ్‌ రాములునాయక్‌, తుక్కుగూడ మాజీ సర్పంచ్‌ డి.సుఽధాకర్‌ తదితరులు ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రైతు సమితి జిల్లా కమిటీ కూన యాదయ్య, మన్సాన్‌పల్లి ఎల్లమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ మురళీధర్‌రెడ్డి, ఘట్టుపల్లి మాజీ సర్పంచ్‌ రాఖేష్‌రెడ్డి, మహేశ్వరం పలువురు మాజీ ఉపసర్పంచ్‌లు, తుక్కుగూడ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ మహిళావిభాగం అధ్యక్షురాలు పద్మ, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలు, మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్ల ప్రజాప్రతినిధులు పదవులకు, రాజీనామాలు చేసి కాంగ్రె్‌సలో చేరారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో గెల్చిన బీఆర్‌ ఎస్‌ను ఇక్కడ దెబ్బకొట్టాలనే కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా నాయకులను చేర్చుకుంటోంది. మహేశ్వరం, కందుకూరు మండలాల బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. పలువురు బీజేపీ కార్యకర్తలు సైతం కాంగ్రెస్‌లో చేరతారనే వార్తలొస్తున్నాయి. కేఎల్లార్‌, తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డిలు లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించి మరో మూడు నెలల్లో రానున్న పంచాయతీ/పరిషత్‌/మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ పద వులను హస్తగతం చేసుకునేలా పావులు కదుపుతున్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న వారు ఎక్కువ మంది కారు పార్టీకి గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. రానున్న ఐదేళ్లు మహేశ్వరాన్ని కాంగ్రెస్‌ అడ్డాగా మార్చేందుకు నాయకులు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. రాజకీయ ఉద్దండురాలైన ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఇదంతా చూస్తూ మౌనంగా ఉండడం బీఆర్‌ఎస్‌లో దుమారాన్ని రేపుతోంది. సబిత మౌనం వెనక మర్మమేంటో? అని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కాగా పార్లమెంట్‌ ఎన్నికల నాటికి బీఆర్‌ఎ్‌సను ఖాళీ చేయాలని కాంగ్రెస్‌ కంకణం కట్టుకుంది.

Updated Date - Apr 08 , 2024 | 12:02 AM