Share News

కల్వర్టు సమస్య పరిష్కారం

ABN , Publish Date - May 23 , 2024 | 11:47 PM

‘అస్తవ్యస్తంగా మురుగునీటి వ్యవస్థ’ అనే శీర్షికను మే 19న ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

కల్వర్టు సమస్య పరిష్కారం
తాండూరు ప్రధాన రోడ్డులో చెత్తను తొలగించి మెరుగు పర్చిన కల్వర్టు

బషీరాబాద్‌, మే 23: ‘అస్తవ్యస్తంగా మురుగునీటి వ్యవస్థ’ అనే శీర్షికను మే 19న ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బషీరాబాద్‌-తాండూరు ప్రధాన రోడ్డు మార్గంలోని కల్వర్టు నిండి మురుగునీరు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం ఎక్‌సావేటర్‌తో కల్వర్టు కింద పేరుకుపోయిన చెత్తను తొలగింపజేసి మురుగు నీటి పారుదలకు తగిన చర్యలు తీసుకున్నారు. ఏట్టకేలకు అధికారులు స్పందించి మురుగు నీటి వ్యవస్థను మెరుగుపర్చడంతో స్థానిక ప్రజలు ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 23 , 2024 | 11:47 PM