Share News

అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

ABN , Publish Date - Sep 03 , 2024 | 12:09 AM

అనుమానాస్పదస్థితిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతిచెందిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

ఘట్‌కేసర్‌ రూరల్‌, సెప్టెంబరు 2: అనుమానాస్పదస్థితిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతిచెందిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని ఏష్‌ టెక్నాలజీ సంస్థ మేనేజర్‌ మంద శ్రీకాంత్‌ తన జన్మదిన వేడుకలను ఆదివారం అర్ధరాత్రి ఘట్‌కేసర్‌ మండలం ఘనాపూర్‌లోని వెంకటే్‌షకు చెందిన ఫాంహౌ్‌సలో చేసుకున్నారు. ఈ వేడుకల్లో సంస్థలో పనిచేసే దాదాపు 20మంది పాల్గొన్నారు. మద్యం సేవించిన సాయికుమార్‌, రంజిత్‌రెడ్డిలు మద్యంమత్తులో తోటి ఉద్యోగైన గజాంబికల్‌ అజయ్‌తేజ(24)కు ఈతరాదని తెలిసి బలవంతంగా ఎత్తుకొని పక్కనే ఉన్న సిమ్మింగ్‌పూల్‌లో పడేశారు. దీంతో ఈత రాకపోవడంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని జోడిమెట్లలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అజయ్‌తేజ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడి మేనమామ కిషోర్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాంత్‌, రంజిత్‌రెడ్డి, సాయికుమార్‌, ఫాంహౌస్‌ యజమాని వెంకటే్‌షను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Sep 03 , 2024 | 08:12 AM