Share News

అనుమతులు చూపించండి

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:51 PM

: అనుమతులు లేకుండా రిసార్ట్స్‌ నడిపిస్తే చర్యలు తప్పవని వెంటనే అనుమతులు చేపించాలని పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు.

అనుమతులు చూపించండి
టిక్కివిలేజ్‌ రిసార్ట్స్‌ నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్న పంచాయతీ కార్యదర్శి స్వాతి

  • ఆంధ్రజ్యోతి కథనంతో అధికారుల చర్యలు

  • రిసార్ట్స్‌ నిర్వాహకులకు నోటీసులు

వికారాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా రిసార్ట్స్‌ నడిపిస్తే చర్యలు తప్పవని వెంటనే అనుమతులు చేపించాలని పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. గతంలో అనుమతులు లేవని సీజ్‌ చేసినా మళ్లీ తెరిచి నడిపించడమేంటని, నోటీసులు చూపించండి అని నోటీసులు అందజేశారు. ఈనెల 19న ఆంధ్రజ్యోతిలో ‘సర్పన్‌పల్లి చెరువు.. అక్రమాలకు అడ్డా!’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు పంచాయతీ కార్యదర్శి స్వాతి ద్వారా అక్రమంగా కొనసాగుతున్న గోఽధుమగూడ పరిధిలోని ఐదు రిసార్ట్స్‌లకు నోటీసులు జారీ చేశారు. గోధుమగూడ పరిధిలోని టిక్కివిల్లా, వైల్డర్‌ నెస్‌, అవని, వింటేజ్‌ విలేజ్‌తో పాటు మరో రిసార్ట్స్‌లో అనుమతులు లేకుండా బుకింగ్‌లు చేసినా, న్యూయర్‌ వేడుకలు నిర్వహించినా చర్యలు తప్పవని అధికారి సూచించారు. అనుమతి పత్రాలను గ్రామా పంచాయతీలో చూపించిన తర్వాతే వేడుకలు చేసుకోవాలన్నారు.

జిల్లా అధికారులు సీరియస్‌

రిసార్ట్స్‌ అనుమతి లేకుండా న్యూయర్‌ వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. రిసార్ట్స్‌, ఫాంహౌస్‌లలో న్యూయర్‌ వేడుకలు నిర్వహించాలని పోలీస్‌ శాఖ తరుఫున అనుమతులు తీసుకోవాలని అందుకు సంబంధించి అనుమతి పత్రాలు పోలీస్‌ శాఖకు అందించాలని సూచించారు.

Updated Date - Dec 28 , 2024 | 11:51 PM