Share News

‘అమృత్‌ భారత్‌’కు షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ ఎంపిక

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:54 PM

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్‌ భారత్‌ కార్యక్రమానికి షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ ఎంపికైంది. రాష్ట్రంలో ఎంపిక చేసిన 15రైల్వేస్టేషన్లలో షాద్‌నగర్‌కు ఉండడంపై దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ గోపాల్‌నారాయణ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు.

‘అమృత్‌ భారత్‌’కు షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ ఎంపిక

ఆధునిక వసతుల కోసం 9.59కోట్లు మంజూరు

షాద్‌నగర్‌, ఫిబ్రవరి 25: రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్‌ భారత్‌ కార్యక్రమానికి షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ ఎంపికైంది. రాష్ట్రంలో ఎంపిక చేసిన 15రైల్వేస్టేషన్లలో షాద్‌నగర్‌కు ఉండడంపై దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ గోపాల్‌నారాయణ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. అమృత్‌ భారత్‌లో భాగంగా షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో మినీ ఎయిర్‌ పోర్ట్‌ తరహాలో ఆధునికీకరిస్తారని తెలిపారు. ప్రధాన ద్వారంతో పాటు ట్రాఫిక్‌ వసతు లు, వెయిటింగ్‌ రూములు, ప్రయాణికులకు వీలుగా సమాచార సూచికలను వృద్ధిచేసేందుకు రూ.9.59కోట్లు మంజూరు చేశారన్నారు. కాగా అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్లలో చేపట్టే పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఉదయం 10:30 గంటలకు వర్చువల్‌ ద్వారా ప్రారంభించనున్నారని, ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

Updated Date - Feb 25 , 2024 | 11:54 PM