Share News

బాలికపై యువకుడి లైంగిక దాడి

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:38 AM

బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ సంఘటన బషీరాబాద్‌ మండల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది.

బాలికపై యువకుడి లైంగిక దాడి

గర్భం దాల్చిన పదో తరగతి విద్యార్థి

పోలీసులకు కుటుంబీకుల ఫిర్యాదు.. కేసు నమోదు

బషీరాబాద్‌, ఏప్రిల్‌ 24 : బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ సంఘటన బషీరాబాద్‌ మండల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) ఇటీవల పదోతరగతి పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన కర్రె నరేష్‌(24) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన అతడు.. రోజూ పాఠశాల ఎదుట ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆటోను నిలిపేవాడు. బాలికతో మాటలు కలిపి ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలికపై పలుమార్లు యువకుడు లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చింది. బాలిక నడవడిక, తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పింది. తన కూతురుకు జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం కుల పెద్దల దృష్టికి తీసుకెళ్లి చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, తల్లిదండ్రులు బాలికతో పాటు బషీరాబాద్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం తాండూరు జిల్లా ఆసుపత్రికి పంపించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 12:38 AM