నిబంధనలు పాటించని ఏడు క్లినిక్‌లు సీజ్
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:15 AM
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆసుపత్రులు, క్లినిక్‌లపై జిల్లా వైద్యాధికారులు కొరడా ఝళిపించారు. శంకర్‌పల్లిలో దాడులు చేసి ఏడు క్లినిక్‌లను సీజ్ చేశారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఉపవైద్యాధికారి దామోదర్‌ల బృందం శంకర్‌పల్లిలో బుధవారం సాయత్రం తనిఖీ చేస్తుండగా విషయం తెలుసుకున్న కొందరు ఆర్‌ఎంపీ డాక్టర్లు తమ క్లినిక్‌లను బంద్ చేసుకొని వెళ్లారు.

శంకర్‌పల్లి, జూన్ 26: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆసుపత్రులు, క్లినిక్‌లపై జిల్లా వైద్యాధికారులు కొరడా ఝళిపించారు. శంకర్‌పల్లిలో దాడులు చేసి ఏడు క్లినిక్‌లను సీజ్ చేశారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఉపవైద్యాధికారి దామోదర్‌ల బృందం శంకర్‌పల్లిలో బుధవారం సాయత్రం తనిఖీ చేస్తుండగా విషయం తెలుసుకున్న కొందరు ఆర్‌ఎంపీ డాక్టర్లు తమ క్లినిక్‌లను బంద్ చేసుకొని వెళ్లారు. వెంకటేశ్వర, సంపత్, దివ్య, బాలాజీ క్లినిక్‌లను సీజ్ చేశారు. ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్‌ఎంపీ లు నిబంధలకు విరుద్దంగా క్లినిక్‌లు చేర్పాటు చేసి వైద్యం చేస్తుండంతో వీటిని సీజ్ చేశారు. శ్రీనివాస సేవానికేతన్ క్లినిక్ పత్రాలు సక్రమంగా లేకపోవడంతో సీజ్ చేశారు. నాటు వైద్యం చేస్తున్న ప్రజ్వల్‌బోన్, బాలాజీ బోన్ సెట్టింగ్స్ సెంటర్లను సీజ్ చేశారు. స్వరాజ్ ఆసుపత్రిలో లేబర్ గది, ఆపరేషన్ థియేటర్‌లో నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వైద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతీయ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌ల ఆదేశాల మేరకు ఆసుపత్రులను తనిఖీ చేయడం జరుగుతున్నదన్నారు. జిల్లావ్యాప్తంగా నిర్వహణ సక్రమంగా లేని 13 ఆసుపత్రుకు అపరాధ రుసుం వేయడం జరిగిందని వివరించారు. ఆర్ ఎంపీలు డాక్టర్లు కాదని, వారు డాక్టర్లుగా బోర్డులు పెట్టుకోవద్దని హెచ్చరించారు. ప్రఽథమ చికత్స మాత్రమే చేయాలని, అర్హతకు మించిన వైద్యం చేయకూడదన్నారు. గోకుల్ ఆసుపత్రి డాక్టర్ కుమార్, లలిత క్లినిక్ డాక్లర్లు లింగారెడ్డి, నవీనలకు సరైనపత్రాలు లేనందున నోటీసులందజేశారు. సీహెచ్‌వో గోపాల్‌రెడ్డి, డాక్టర్లు ఉన్నారు.