Share News

కల్యాణ వైభోగమే!

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:47 PM

శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని గ్రామాలు, పట్టణాల్లో కనుల పండువగా జరుపుకున్నారు.

కల్యాణ వైభోగమే!
మైసిగండిలో రాముల వారి కల్యాణం

కనుల పండువగా సీతారాముల కల్యాణ మహోత్సవాలు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 17) : శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని గ్రామాలు, పట్టణాల్లో కనుల పండువగా జరుపుకున్నారు. బుధవారం తెల్లవారుజామునే రామయ్య సుప్రభాత సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం కల్యాణ మూర్తులను పల్లకీల్లో ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. అభిజిత్‌ లగ్న సమయంలో సీతారాముల ఉత్సవమూర్తుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచి కల్యాణాన్ని జరిపించారు. ఉత్సవాలను తిలకించేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ సీతారాముల వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. షాబాద్‌ మండలం సీతారామపురంలో శ్రీరామచంద్రస్వామి ఆలయంలో కల్యాణోత్సవానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్‌ సీతారెడ్డి హాజరయ్యారు.

కడ్తాల్‌: కడ్తాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మైసిగండి రామాలయంలో సీతారాముల పరిణయ వేడుకను వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని వీక్షించేందుకు రంగారెడ్డి, హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ పి.రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ లాంఛనాలతో కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఎండోమెంట్‌ శాఖ అధికారులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చారు. ఫౌండర్‌ ట్రస్టీ రమావత్‌ సిరోలి పంతూ, ఈవో స్నేహలత, ఉత్సవ నిర్వాహకుడు భాస్కర్‌వాగ్దేవి, తహసీల్దార్‌ ఆర్పీ జ్యోతిఅరుణ్‌లు పట్టువస్త్రాల తరలిం పులో పాల్గొన్నారు. వేదపండితులు కల్యాణ క్రతువును జరిపించారు.సాయంత్రం పూజలు కొనసాగాయి. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీపీ కమ్లిమోత్యనాయక్‌, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు శ్రీనివా్‌సరెడ్డి, బిక్యానాయక్‌, నర్సింహ, బిచ్యానాయక్‌, సీఐ శివప్రసాద్‌, ఎస్సై వరప్రసాద్‌, శేఖర్‌గౌడ్‌, ఆర్‌.తులసీరామ్‌, లక్ష్మీనర్సింహారెడ్డి, వెంకటేశ్‌, జవహర్‌లాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 11:47 PM