Share News

ఎడ్లను కబేళాలకు తరలిస్తుండగా పట్టివేత

ABN , Publish Date - May 21 , 2024 | 11:32 PM

అనుమతి లేకుండా ఎడ్లను కబేళాకు తరలిస్తున్న ఓవ్యక్తిని ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టుచేసి ఎడ్లను గోశాలకు తరలించారు.

   ఎడ్లను కబేళాలకు తరలిస్తుండగా పట్టివేత

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 21: అనుమతి లేకుండా ఎడ్లను కబేళాకు తరలిస్తున్న ఓవ్యక్తిని ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టుచేసి ఎడ్లను గోశాలకు తరలించారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి యంనంపేట్‌ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎడ్లను తరలిస్తున్న అశోక్‌ లేల్యాండ్‌ వాహనాన్ని అపి తనిఖీ చేశారు. మేత, నీరులేకుండా ఐదు ఎడ్లను యాదాద్రి- భువనగిరి జిల్లా, బీబీనగర్‌ మండలం, కొండమడుగు సంత నుంచి బార్కా్‌సలోని కబేళాలకు తరలిస్తున్న డ్రైవర్‌ సిఫాత్‌ ఉర్‌రెహమాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఎడ్లను జియాగూడలోని గోశాలకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - May 21 , 2024 | 11:32 PM