Share News

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

ABN , Publish Date - Feb 11 , 2024 | 11:43 PM

మద్యప్రదేశ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సీఐ గోవర్దనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి ఔటర్‌రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు.

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
మద్యప్రదేశ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యంను చూపుతున్న పోలీసులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఫిబ్రవరి 11: మద్యప్రదేశ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సీఐ గోవర్దనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి ఔటర్‌రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. అజాగ్రత్తగా నిర్లక్ష్యంతో తప్పించుకోవడానికి యత్నించిన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా మద్యప్రదేశ్‌ నుంచి అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తున్నట్లు చెప్పారు. యాదాద్రి జిల్లా, రామన్నపేట్‌కు చెందిన బారుపాటి జగన్‌మోహన్‌(51), వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం, మణిగిల్ల గ్రామానికి చెందిన మేరెడ్డి ప్రశాంత్‌రెడ్డి(28) కోలాపూర్‌ నుంచి అనుమతి లేకుండా సిగ్నిచర్‌ 84బాటిళ్లు, రాయల్‌స్టాగ్‌ 12బాటిళ్లు, అఫీసర్‌ చాయిస్‌ 90ఎంఎల్‌ 96 బాటిళ్ళను తీసుకొస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలించిన మద్యం రూ.లక్ష విలువ ఉంటుందని చెప్పారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో మల్కాజ్‌గిరి డివిజన్‌ అడిషనల్‌ డీసీపీ ప్రసాదరావు, ఉప్పల్‌ ఉమెన్‌ పోలీసుస్టేషన్‌ సీఐ మంజుల, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Feb 11 , 2024 | 11:43 PM