Share News

కబేళాకు తరలిస్తున్న ఎడ్లు స్వాధీనం

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:42 PM

ఎడ్లను అక్రమంగా కబేళాకు తరలిస్తున్న వాహ నాన్ని మంగళవారం చేవెళ్లలో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ నాయకులు అడ్డుకొని పోలీ్‌సలకు అప్పగించారు.

కబేళాకు తరలిస్తున్న ఎడ్లు స్వాధీనం

చేవెళ్ల, మార్చి 12 : ఎడ్లను అక్రమంగా కబేళాకు తరలిస్తున్న వాహ నాన్ని మంగళవారం చేవెళ్లలో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ నాయకులు అడ్డుకొని పోలీ్‌సలకు అప్పగించారు. ఈమేరకు ఏడు ఎడ్లను తరలిస్తున్న లారీని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అనంతరం పశువుల లారీని కోకాపేట్‌లోని శ్రీ కృష్ణగోశాలకు పోలీ్‌సలు తరలించారు. ఈసందర్భంగా వీహెచ్‌పీ జిల్లా నాయకుడు చేగూరి భోజిరెడ్డి, జిల్లా ధర్మప్రచారక్‌ చిల్కూర్‌ శ్రీనివాస్‌లు, భజరంగ్‌దళ్‌ నాయకులు చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డికి అక్రమంగా జీవాలను కబేళాలకు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నిత్యం అర్ధరాత్రి గోవులను ఒకటిపై ఒకటివేసి కంటైనర్లలో కుక్కి కబేళాలకు తీసుకెళ్తున్నారని, పోలీ్‌సలు బాధ్యులను కఠినంగా శిక్షించాలని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. చేవెళ్లలో చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేయాలన్నారు. వీహెచ్‌పీ జిల్లా నాయకులు సురేందర్‌, సాయిరాంరెడ్డి, రవీందర్‌రెడ్డి, మహేశ్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 11:42 PM