ఉత్సాహంగా సీత్లా పండగ
ABN , Publish Date - Aug 08 , 2024 | 11:47 PM
మండలంలోని గుమ్మడవెళ్లితండాలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గిరిజనులు సీత్లా పండుగను కనుల పండువగా జరుపుకున్నారు. తండాలో బోనాలను ఊరేగించి కులదైవానికి నైవేద్యం సమర్పించారు.
కందుకూరు. ఆగస్టు 8 : మండలంలోని గుమ్మడవెళ్లితండాలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గిరిజనులు సీత్లా పండుగను కనుల పండువగా జరుపుకున్నారు. తండాలో బోనాలను ఊరేగించి కులదైవానికి నైవేద్యం సమర్పించారు. పూజారి జగ్గునాయక్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పోతురాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, స్థానికులు గణే్‌షనాయక్, శంకర్, సిద్ధార్థ్, లాలూ, చందర్, రాజు, హరిలాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.