Share News

జన్వాడలో 21 వరకు 144 సెక్షన్‌

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:05 AM

జన్వాడ గ్రామంలో చోటుచేసుకున్న రోడ్డు వివాదం ఇరు వర్గాల ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ నెల 21 వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని సైబరాబాద్‌ సీపీ ఆదేశాలు జారీ చేసింది.

జన్వాడలో 21 వరకు 144 సెక్షన్‌

శంకర్‌పల్లి, ఫిబ్రవరి 16 : జన్వాడ గ్రామంలో చోటుచేసుకున్న రోడ్డు వివాదం ఇరు వర్గాల ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ నెల 21 వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని సైబరాబాద్‌ సీపీ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హిందువులను అక్రమంగా అరెస్ట్‌ చేశారనే ఉద్దేశ్యంతో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ సభ్యులు మోకిల పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడిస్తామనే సమాచారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జన్వాడకు వెళ్లే 4రహదారులను స్పెషల్‌ ఫోర్స్‌తో వాహనాలను క్షుణంగా తనిఖీ చేసి గ్రామానికి పంపిస్తున్నారు. నార్సింగ్‌ ఏసీపీ రమణగౌడ్‌ ఆధ్వర్యంలో బందోబస్త్‌ నిర్వహించారు.

వాహనదారులు ధ్రువపత్రాలు కలిగి ఉండాలి

యాచారం, ఫిబ్రవరి 16 : వాహనదారులు ధ్రువపత్రాలు కలిగి ఉండాలని హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీసులు సూచించారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం మేడిపల్లిలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు. డ్రైవింగ్‌ పత్రాలు లేని వాహనదారులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. రూ.50వేలకు మించి డబ్బు ఉంటే తగిన ఆధారాలు చూపాలన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విధిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు.

Updated Date - Feb 17 , 2024 | 12:05 AM