Share News

ఈవీఎంల పరిశీలన పారదర్శకంగా జరగాలి

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:05 AM

రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఎలక్ర్టానిక్‌ వోటింగ్‌ మిషన్‌(ఈవీఎం)ల పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని మేడ్చల్‌ కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. ఈవీఎంల పరిశీలనలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో భద్రపర్చిన ఈవీఎంలను కలెక్టర్‌ గౌతమ్‌ పరిశీలించారు.

ఈవీఎంల పరిశీలన పారదర్శకంగా జరగాలి
కలెక్టరేట్‌లో ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌

ఈ నెల 14 వరకు రాజకీయ పార్టీల నాయకుల

సమక్షంలో పరిశీలన : మేడ్చల్‌ కలెక్టర్‌ గౌతమ్‌

కీసర, ఫిబ్రవరి 5 : రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఎలక్ర్టానిక్‌ వోటింగ్‌ మిషన్‌(ఈవీఎం)ల పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని మేడ్చల్‌ కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. ఈవీఎంల పరిశీలనలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో భద్రపర్చిన ఈవీఎంలను కలెక్టర్‌ గౌతమ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రోజూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు ఈవీఎంల పరిశీలన చేస్తామన్నారు. నాయకులకు ఈవీఎంలపై కలిగే అనుమానాలను నివృత్తి చేస్తామన్నారు. నియమ, నిబంధనలకు లోబడి ఈవీఎంల పరిశీలన జరుగుతుందన్నారు. మిషన్ల పరిశీలన సమయంలో ఈసీఐఎల్‌కు చెందిన 26 మంది సాంకేతిక నిపుణులు పాల్గొంటారని.. ఈవీఎంలు, బ్యాలెట్‌ పత్రాల పరిశీలనలో ఎలాంటి అనుమానాలున్నా వాటిని నివృత్తి చేసేందుకు అధికారులు, సాంకేతిక సిబ్బంది సిద్ధంగా ఉంటారని కలెక్టర్‌ వివరించారు. పరిశీలనకు ముందు ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, మాల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల గోదాములను కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, డీఆర్వో హరిప్రియ, కార్యాలయాల సిబ్బంది ఉన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:05 AM