Share News

జిల్లా కలెక్టర్‌గా శశాంక

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:00 PM

తెలంగాణలో నూతన ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పాలనపర నిర్ణయాలు మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుంటున్నారు.

జిల్లా కలెక్టర్‌గా శశాంక

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 3 : తెలంగాణలో నూతన ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పాలనపర నిర్ణయాలు మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుంటున్నారు. ప్రభావవంత పాలన అందించేందుకు, సంక్షేమ పథకాల అమలు పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం భారీస్థాయిలో ఏఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 26మంది ఐఏఎస్‌ అధికారులకు బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్‌ కలెక్టర్‌గా పనిచేసిన కె.శశాంకను రంగారెడ్డి కలెక్టర్‌గా నియమించారు. ఇప్పటి వరకు పూర్తిస్థాయి ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉన్న గౌతమ్‌ పొట్రును ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. కొత్త కలెక్టర్‌ 2013 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి. గురువారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. శశాంక 2014 నుంచి 2016 డిసెంబరు వరకు జగిత్యాల సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. 2016 డిసెంబరు నుంచి 22నెలలు కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా, జోగులాంబ-గద్వాల్‌ కలెక్టర్‌గా పనిచేశారు. శశాంక స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల. మేనమామ సొంతూరు బిజులాపురంలో ఉండి మోత్కూరులో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆయన సతీమణి సింధూశర్మ ఐపీఎ్‌సగా పనిచేస్తున్నారు.

మూడు నెలల్లో ముగ్గురు కలెక్టర్లు!

జిల్లాకు మూడు నెలల్లోనే ముగ్గురు కలెక్టర్లు మారారు. డిసెంబరులో నిర్వహించిన శాసనసభ ఎన్నికల సమయంలో అప్పటి కలెక్టర్‌ హరీ్‌షను ఈసీ బదిలీ చేసింది. కొత్త కలెక్టర్‌గా భారతి హొలికేరి అక్టోబరు 13న బాధ్యతలను చేపట్టారు. కలెక్టర్‌ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న 98 దస్ర్తాలు కలెక్టర్‌ ఆమోదం లేకుండానే ధరణిలో ఆమోదం లభించింది. ధరణిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని కొత్త ప్రభుత్వం భారతిని బదిలీ చేసింది. ఆమె 2నెలల 11రోజులు కలెక్టర్‌గా పనిచేశారు. ఆమె స్థానంలో మేడ్చల్‌ కలెక్టర్‌ గౌతమ్‌కు రంగారెడ్డి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన డిసెంబరు 24 నుంచి జనవరి 3 వరకు విధులు నిర్వహించారు. తాజాగా జరిగిన ఐఏఎస్‌ బదిలీల్లో మహబూబాబాద్‌ కలెక్టర్‌గా ఉన్న కె.శశాంకను రంగారెడ్డి కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.

Updated Date - Jan 03 , 2024 | 11:00 PM