Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

సర్ధార్‌ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శం

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:31 AM

నిరుపేద కుటుంబంలో పుట్టి గోల్కోండ కోటను జయించిన సర్ధార్‌ సర్వాయి పాపన్న జీవితం నేటి తరానికి ఆదర్శమని ఘట్‌కేసర్‌ మజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

సర్ధార్‌ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శం
సర్వాయి పాపన్న విగ్రహానికి నివాళులర్పిస్తున్న గౌడ సంఘం నాయకులు

ఘట్‌కేసర్‌, మార్చి 3: నిరుపేద కుటుంబంలో పుట్టి గోల్కోండ కోటను జయించిన సర్ధార్‌ సర్వాయి పాపన్న జీవితం నేటి తరానికి ఆదర్శమని ఘట్‌కేసర్‌ మజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఘట్‌కేసర్‌లోని అవుటర్‌ రింగ్‌రోడ్డు చౌరస్తా వద్ద గల సర్ధార్‌ సర్వాయి పాపాన్న గౌడ్‌కు ఆదివారం నివాళులర్పించారు. ఈసందర్భంగా ఘనాపూర్‌ మాజీ సర్పంచ్‌ వేముల సంజీవగౌడ్‌ కుటుంబసభ్యులు వేముల బలగం తరలివచ్చి పాపాన్న గౌడ్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత పాపన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి దాసు, కౌన్సిలర్లు బండారి అంజనేయులు, రమాదేవి, నాయకులు బాల్‌రాజ్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:31 AM