ఇసుక ట్రాక్టర్ సీజ్
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:40 AM
మండలంలోని ఇర్విన్ పరిధి గంగ్యాగాని తండా వాగు నుంచి మంగళవారం ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తుండా పోలీసులు పట్టుకున్నారు.

మాడ్గుల, మార్చి 5 : మండలంలోని ఇర్విన్ పరిధి గంగ్యాగాని తండా వాగు నుంచి మంగళవారం ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తుండా పోలీసులు పట్టుకున్నారు. ఎక్స్‌కవేటర్, ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ జోజిరెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ ఉపేందర్ తెలిపారు.