Share News

ఇసుక అక్రమ రవాణాకు చెక్‌!

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:17 PM

ఇసుక అక్రమ రవాణా, తవ్వకాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు కార్యోణ్ముఖులవుతున్నారు.

ఇసుక అక్రమ రవాణాకు చెక్‌!
తాండూరులో సమీక్షిస్తున్న ఆర్డీవో, మైన్స్‌ ఏడీ, పోలీస్‌ అధికారులు

రూ.600కే నిర్మాణాలకు ట్రాక్టర్‌ ఇసుక

ఇసుక లభ్యత కేంద్రాల గుర్తింపు

తాండూరు, జనవరి 18 : ఇసుక అక్రమ రవాణా, తవ్వకాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు కార్యోణ్ముఖులవుతున్నారు. గురువారం పోలీస్‌, రెవెన్యూ, మైన్స్‌ అధికారులు సమావేశమై ఇసుక పాలసీ రూపొందించారు. ఇసుక లభ్యత కేంద్రాలను గుర్తించారు. ఆర్డీవో శ్రీనివా్‌సరావు అధ్యక్షతన డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, మైన్స్‌ ఏడీ జాకబ్‌, సీఐ రాంబాబు, తహసీల్దార్లు, ఎస్‌ఐలు ఎంపీడీవోలతో సమీక్షించారు. పాత తాండూరు, వీర్‌శెట్టిపల్లి, ఖాజాపూర్‌, బషీరాబాద్‌ మండలం నవాంద్గి, గంగ్వారం, పెద్దేముల్‌ మండలం రేగొండి, కొండాపూర్‌ గ్రామాల్లో ఇసుక లభ్యత ఉంటుందని గుర్తించారు. వ్యక్తిగత నిర్మాణాలకు ఇసుక అవసరం ఉన్న వారు రూ.600 డీడీని తహసీల్దార్‌ కార్యాలయంలో చెల్లించి పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రాన్ని జతచేసి అనుమతి పొందాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పాత తాండూరు, వీర్‌శెట్టిపల్లి, ఖాజాపూర్‌, నవాంద్గి, రేగొండి పాయింట్లలో ఇసుక ఇవ్వాలని నిర్ణయించారు. వేబిల్‌ లేకుండా ఇసుక రవాణా చేసే వాహనాలను సీజ్‌ చేయాలని, పోలీసులు నిఘా పెంచాలని నిర్ణయించారు.

Updated Date - Jan 18 , 2024 | 11:17 PM