Share News

గుంతల రోడ్డుకు మోక్షం

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:53 PM

మున్సిపాలిటీ పరిధిలో పాడైపోయిన అంతర్గత రోడ్లతో పాటు, ప్రధాన రోడ్ల నిర్మాణంపై పాలకవర్గం దృష్టి సారించింది. మున్సిపాలిటీలోని ప్రధాన రోడ్డు ఎంపీ పటేల్‌గూడ నుంచి బొంగ్లూర్‌ ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు వరకు రోడ్డు గుంతలమయంగా ఉండేది. దాంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడేవారు.

గుంతల రోడ్డుకు మోక్షం
ఎంపీ పటేల్‌గూడ నుంచి బొంగ్లూర్‌ మధ్య వేసిన డబుల్‌ రోడ్డు

సాఫీగా సాగుతున్న ప్రయాణం

రూ.2 కోట్లతో 1.2 కి.మీ. బీటీ రోడ్డు

వాహనదారులు, ప్రయాణికుల హర్షం

ఆదిభట్ల, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలో పాడైపోయిన అంతర్గత రోడ్లతో పాటు, ప్రధాన రోడ్ల నిర్మాణంపై పాలకవర్గం దృష్టి సారించింది. మున్సిపాలిటీలోని ప్రధాన రోడ్డు ఎంపీ పటేల్‌గూడ నుంచి బొంగ్లూర్‌ ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు వరకు రోడ్డు గుంతలమయంగా ఉండేది. దాంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడేవారు. దాంతో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి టీయూఎ్‌ఫఐడీసీ (తెలంగాణ అర్బన్‌ ఫైౖనాన్షియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నుంచి రూ.2కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఈమేరకు బొంగ్లూర్‌ నుంచి ఎంపీ పటేల్‌గూడ రోడ్డు వరకు 1.2 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు చేపట్టారు. దాంతో వాహనదారులు, ప్రయాణికులు సాఫీగా రాకపోకలు సాగిస్తున్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎంపీ పటేల్‌గూడ రోడ్డు నుంచి బొంగ్లూర్‌ చౌరస్తా వరకు ఉన్న ప్రధాన రోడ్డును డబుల్‌ రోడ్డుగా విస్తరించారు. దాంతో మున్సిపాలిటీకి కొత్త శోభ సంతరించుకుంది. ఏళ్ల తరబడి రోడ్లు బాగా లేకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు, నానా ఇబ్బందులు పడ్డారు.

ఇబ్బందులు తీరాయి

బొంగ్లూర్‌ గ్రామం నుంచి చౌరస్తా వరకు రోడ్డు సక్రమంగా లేకపోవడంతో గతంలో వాహనాదారులు ఈ రహదారిపై ప్రయాణమంటేనే భయపడేవారు. డబుల్‌ రోడ్డు వేయడంతో ఇబ్బందులు తప్పాయి. రోడ్డు అందుబాటులోకి రావడంతో వాహనదారులు, ప్రయాణికుల కష్టాలు తీరాయి. చాలా వరకు ప్రమాదాలు కూడా తగ్గాయి.

- మర్రి అర్చనా రాంరెడ్డి, కౌన్సిలర్‌, బొంగ్లూర్‌

అంతర్గత రోడ్లు, డ్రైనేజీపై వ్యవస్థపై దృష్టి

ఆదిభట్ల మున్సిపాలిటీలో ప్రధాన సమస్యలపై దృష్టిపెట్టాం. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మంత్రి కోమటిరెడ్ది వెంకట్‌రెడ్డి సహకారంతో మున్సిపాలిటీకి అధిక నిధులు తీసుకొస్తాం. ఇప్పటికే చాలావరకు కాలనీల్లో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేశాం.

- మర్రి నిరంజన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌, ఆదిభట్ల

Updated Date - Dec 22 , 2024 | 11:53 PM