Share News

గడువు తీరిన విత్తనాల అమ్మకం

ABN , Publish Date - May 31 , 2024 | 12:16 AM

వర్షాకాలం ప్రారంభంలోనే నకిలీ విత్తనాల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే కొడంగల్‌ మండలం హస్నాబాద్‌లో విక్రయించేందుకు సిద్ధం చేసిన నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు.

గడువు తీరిన విత్తనాల అమ్మకం
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న రైతు శంకర్‌, గిరిజన సంఘం నాయకులు

రైతుకు అంటగట్టిన దుకాణదారుడు

డయల్‌ 100కు సమాచారమిచ్చి ఫిర్యాదు

కొడంగల్‌, మే 30 : వర్షాకాలం ప్రారంభంలోనే నకిలీ విత్తనాల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే కొడంగల్‌ మండలం హస్నాబాద్‌లో విక్రయించేందుకు సిద్ధం చేసిన నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. గురువారం కొడంగల్‌లోని ఓం ట్రేడింగ్‌ ఫర్టిలైజర్స్‌లో గడువు తీరిన 10కిలోల కంది విత్తనాల ప్యాకెట్‌ను శంకర్‌ అనే రైతుకు విక్రయించారు. దీంతో రైతు డయల్‌ 100కు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో దుకాణ యజమాని 10 విత్తనాల ప్యాకెట్లను వాపసు తీసుకున్నట్టు రైతు తెలిపాడు. కొడంగల్‌లో నకిలీ విత్తనాలు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్న ఫర్టిలైజర్స్‌ దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. వర్షాలు కురుస్తాయని విత్తనాల కోసం రైతులు దుకాణాలకు పరుగులు తీస్తున్న క్రమంలో నకిలీ, గడువు ముగిసిన విత్తనాలు అంటగడుతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో లూజ్‌ విత్తనాలు అమ్ముతూ మోసగిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు. కాగా గడువు తీరిన విత్తనాల అమ్మకంపై ఫిర్యాదు చేసిన వారిలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు శ్రవణ్‌నాయక్‌, సంతో్‌షరాథోడ్‌, సంజీవ్‌నాయక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 31 , 2024 | 12:16 AM