Share News

అధిక ధరకు పత్తి విత్తనాలు విక్రయం

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:48 PM

అధిక ధరలకు పత్తి విత్తనాలు అమ్ముతున్న ఫర్టిలైజర్‌ షాపు యాజమానిపై చేవెళ్ల పోలీస్‌లు కేసు నమోదు చేశారు.

అధిక ధరకు పత్తి విత్తనాలు విక్రయం
స్వాధీనం చేసుకున్న పత్తి విత్తనాల ప్యాకెట్లు

యాజమానిపై కేసు నమోదు

చేవెళ్ల, జూన్‌ 7: అధిక ధరలకు పత్తి విత్తనాలు అమ్ముతున్న ఫర్టిలైజర్‌ షాపు యాజమానిపై చేవెళ్ల పోలీస్‌లు కేసు నమోదు చేశారు. సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండల పరిధిలోని ఎన్కెపల్లి చౌరస్తాలో ఉన్న శ్రీసాయి ఏజెన్సీ ఫర్టిలైజర్‌ దుకాణదారు ఈగ లక్ష్మారెడ్డి పత్తి విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.860కు బదులు.. అధిక ధర రూ.1200కు అమ్ముతున్నట్లు చేవెళ్ల ఏవో తులసికి సమాచారం అందింది. దాంతో ఆమె విచారణ చేయగా.. రైతులకు అధిక ధరకు విత్తనాలు అమ్మినట్లు తెలిసింది. ఈమేరకు ఏవో చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేయగా దాదాపు 120 పత్తి విత్తన ప్యాకెట్లు అధిక ధరకు రైతులకు అమ్మినట్లు బిల్లులతో పాటు ఆధారాలు లభించాయి. దాంతో షాపు యాజమాని ఈగ లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. అధిక ధరకు విత్తనాలు, ఎరువులు, మందులు అమ్మితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మకాలు జరపాలని సూచించారు. నిబంధనలు ఉల్లఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

Updated Date - Jun 07 , 2024 | 11:48 PM