ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:25 AM
బస్‌ను ఆపకుండా వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్‌ను నిలదీసిన ఓ ప్రయాణికుడిని డ్రైవర్ కర్రతో తలపై బాది గాయాలపాలు చేశాడు.

మేడ్చల్ టౌన్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): బస్‌ను ఆపకుండా వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్‌ను నిలదీసిన ఓ ప్రయాణికుడిని డ్రైవర్ కర్రతో తలపై బాది గాయాలపాలు చేశాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. రామలింగం అనే ప్రయాణికుడు మంగళవారం మేడ్చల్ నుంచి రామాయంపేట విళ్లడానికి ఆర్టీసీడిపో ఎదురుగా రహదారిపై బస్సుకోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో మేడ్చల్ డిపోకు చెందిన రామాయంపేటకు వెళ్లే బస్ వస్తుండగా చెయ్యి ఎత్తి బస్సును ఆపాలని కోరాడు. అయితే డ్రైవర్ బస్‌ను ఆపకుండా వెళ్లి పోతుంటంతో ప్రయాణికుడు బస్ వెనుకే పరుగులు తీశాడు. దీంతో ప్రయాణికుడు తనను దుర్భాషలాడుతున్నాడని భావించిన డ్రైవర్ బస్‌ను పక్కన ఆపి తన వద్ద ఉన్న కర్రెతో ప్రయాణికుడి తలపై బాదాడు. దీంతో ప్రయాణికుడు లింగం పోలీసులను ఆశ్రయించి ఆర్టీసీ డ్రైవర్‌పై ఫిర్యాదు చేశాడు.