ఆర్టీసీ బస్సును ఢీ కొన్న లారీ.. తప్పిన ముప్పు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:44 PM
మండలంలోని అంతారం పరిధిలో సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ29జెడ్3918) తాండూరు వస్తుండగా తాండూరు బైపాస్ రోడ్డులో మిర్యాణం నుంచి నాపరాతి లోడ్‌తో వస్తున్న లారీ(కేఏ 39 6096) బస్సును ఓవర్‌టేక్ చేస్తూ ఢీకొట్టింది.
తాండూరు రూరల్, అక్టోబరు 1: మండలంలోని అంతారం పరిధిలో సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ29జెడ్3918) తాండూరు వస్తుండగా తాండూరు బైపాస్ రోడ్డులో మిర్యాణం నుంచి నాపరాతి లోడ్‌తో వస్తున్న లారీ(కేఏ 39 6096) బస్సును ఓవర్‌టేక్ చేస్తూ ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అన్సర్, లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గమనించి సైడ్ తీసుకున్నారు. అప్పటికే బస్సుకు ముందు భాగంలో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. బస్సు ముందుభాగంలో అద్దాలు పగిలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులతో పాటు ప్రయాణికులు 80మంది ఉన్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో తాండూరుకు చెందిన ఆర్టీసీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తాండూరు పోలీసులకు సమాచారం అందించి బస్సు డ్రైవర్ అన్సర్, కండక్టర్ సురేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.