Share News

సీసీ రోడ్లకు రూ.2.50 కోట్లు మంజూరు

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:59 PM

జాతీయ ఉపాధిహామీ పథకం కింద సీసీరోడ్ల నిర్మాణానికి మండలానికి 48పనులకు రూ.2.50కోట్లు మంజూరైనట్లు ఇన్‌చార్జి ఎంపీడీవో చెన్నారెడ్డి సోమవారం తెలిపారు.

సీసీ రోడ్లకు రూ.2.50 కోట్లు మంజూరు

ధారూరు, ఫిబ్రవరి 12: జాతీయ ఉపాధిహామీ పథకం కింద సీసీరోడ్ల నిర్మాణానికి మండలానికి 48పనులకు రూ.2.50కోట్లు మంజూరైనట్లు ఇన్‌చార్జి ఎంపీడీవో చెన్నారెడ్డి సోమవారం తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు సీసీరోడ్ల పనులను గ్రౌడింగ్‌ పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. ధారూరుకు రూ.10లక్షలు, లక్ష్మినగర్‌ తండాకు రూ.5లక్షలు, తిమ్మానగర్‌కు రూ.5లక్షలు, చింతకుంటకు రూ.5లక్షలు, హరిదాసుపల్లికి రూ.5లక్షలు, ఎబ్బనూర్‌కు రూ.5లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కొండాపూర్‌ గ్రామానికి రూ.10లక్షలు, కేరెల్లికి రూ.5లక్షలు, బాచారం గ్రామానికి రూ.5లక్షలు, నాగ్‌సాన్‌పల్లికి రూ.5లక్షలు, తరిగోపులకు రూ.10లక్షలు, మైలారం గ్రామానికి రూ.5లక్షలు, అల్లీపూర్‌కు రూ.5లక్షలు, మున్నూర్‌సోమారం గ్రామానికి రూ.10లక్షలు, కొండాపూర్‌కలాన్‌కు రూ.5లక్షలు, నర్సాపూర్‌కు రూ.5లక్షలు, గడ్డమీదిగంగారం గ్రామానికి రూ.5లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. కుక్కిందకు రూ.10లక్షలు, అవుసుపల్లికి రూ.5లక్షలు, నాగసమందర్‌కు రూ.15లక్షలు, అల్లాపూర్‌కు రూ.5లక్షలు, రుద్రారంకు రూ.5లక్షలు, గట్టేపల్లికి రూ.10లక్షలు, కుమ్మర్‌పల్లి తండాకు రూ.5లక్షలు, ధర్మాపూర్‌కు రూ.5లక్షలు, రాంపూర్‌కు రూ.10లక్షలు, స్టేషన్‌ ధారూర్‌కు రూ.10లక్షలు, దోర్నాల్‌కు రూ.10లక్షలు, పీసీఎం తండాకు రూ.5లక్షలు, అంపల్లికి రూ.5లక్షలు, గురుదోట్లకు రూ.5లక్షలు, రాజాపూర్‌కు రూ.5లక్షలు, మెమిన్‌ఖుర్దుకు రూ.5లక్షలు, మోమిన్‌కలాన్‌కు రూ.10లక్షలు, అంతారం గ్రామానికి రూ.5లక్షలు, నాగారంకు రూ.15లక్షలు సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి మంజూరైనట్లు ఆయన వివరించారు.

Updated Date - Feb 12 , 2024 | 11:59 PM