వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించండి
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:06 AM
గత ప్రభుత్వం ఆనాలోచితంగా రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను పునరుద్దరించాలని వీఆర్వో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలిసి అసెంబ్లీలో ప్రస్తావించి వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు.

షాద్‌నగర్ అర్బన్, జూలై 7: గత ప్రభుత్వం ఆనాలోచితంగా రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను పునరుద్దరించాలని వీఆర్వో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలిసి అసెంబ్లీలో ప్రస్తావించి వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు. గ్రామ పరిపాలనకు క్షేత్రపాలకులుగా ఉన్న వీఆర్వో వ్యవస్థను కుట్రపూరితంగా గత ప్రభుత్వం రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. వీఆర్వో వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం సైతం గ్రామ పరిపాలనపై పట్టు కోల్పోతున్నదని తెలిపారు. వీఆర్వో వ్యవస్థను పునరుద్దరించి, చిన్నాభిన్నమైన వీఆర్‌వోలను తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకురావాలని కోరారు. సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో జేఏసీ నాయకులు శ్రీహరి, రమేష్, మానయ్య, జగన్, షబ్బీర్, నరహరి, శ్రీకాంత్‌రెడ్డి, ఆంజనేయులు, బచ్చయ్య, సుధాకర్, రాంచంద్రయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.