Share News

అక్రమ సర్టిఫికెట్ల జారీలో నిందితుల రిమాండ్‌

ABN , Publish Date - Jul 23 , 2024 | 12:23 AM

ఆదాయ సర్టిపికెట్లు జారీ కేసులో నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ బాబ్యనాయక్‌ తెలిపారు.

అక్రమ సర్టిఫికెట్ల జారీలో నిందితుల రిమాండ్‌
నిందితులను చూపుతున్న పోలీసు అధికారులు

మంచాల, జూలై 22 : మంచాల రెవెన్యూ కార్యాలయం నుంచి అక్రమంగా ఆదాయ సర్టిపికెట్లు జారీ కేసులో నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ బాబ్యనాయక్‌ తెలిపారు. మంచాల తహీసీల్దార్‌ కార్యాలయం నుంచి అక్రమంగా ఇన్‌కం సర్టిపికెట్లు తయారు చేసి స్థానికేతరులకు జారీచేయడంతో ఈ ఉదంతం వెలుగులోకొచ్చింది. ఈ కేసులో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పురం సురే్‌షబాబు, గోరు రవికుమార్‌, నగరంలోని ఆర్టీసీ ఎక్స్‌రోడ్డులో గల మీసేవ నిర్వాహకుడు పత్తి రవికుమార్‌లు కమ్మక్కై అక్రమంగా ఆదాయ, ఇతర సర్టిఫికెట్లకు అప్లై చేయించారు. సురే ష్‌బాబు అధికారుల ఎంక్వైరీ రిపోర్టులు లేకుండానే సర్టిఫికెట్లను అప్రూవ్‌ చేసేవాడు. ఈ అక్రమాలపై తహసీల్దార్‌ ఫిర్యాదుతో దర్యాప్తు చేశామని సీఐ బబ్యానాయక్‌ తెలిపారు. సురే్‌షబాబు, జి.రవికుమార్‌, పి.రవికుమార్‌లను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Updated Date - Jul 23 , 2024 | 12:23 AM