Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

చోరీకి గురైన సెల్‌ఫోన్లు రికవరీ

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:10 AM

ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీకి గురైన 18 సెల్‌ ఫోన్లను ఏసీపీ కేపీవీ రాజు, సీఐ సత్యనారాయణ శనివారం బాధితులకు అందజేశారు.

చోరీకి గురైన సెల్‌ఫోన్లు రికవరీ

ఇబ్రహీంపట్నం, మార్చి 2 : ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీకి గురైన 18 సెల్‌ ఫోన్లను ఏసీపీ కేపీవీ రాజు, సీఐ సత్యనారాయణ శనివారం బాధితులకు అందజేశారు. పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఐఎంఈఐనెంబర్లను పరిశీలించి, సీఈఐఆర్‌ అప్లికేషన్‌లో ఎంట్రీచేసి దర్తాప్తు చేసి నిందితుల నుంచి రికవరీ చేసి సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.4.5లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. సెల్‌ఫోన్లు రికవరీ చేసిన ఇబ్రహీంపట్నం క్రైమ్‌ సిబ్బంది, హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణ, కానిస్టేబుల్లు నరేష్‌, కోటేశ్వర్‌రావు, బాబూరావు, శ్రీలతను ఏసీపీ, సీఐ, ఎస్సై మైబెల్లి అభినందించారు.

Updated Date - Mar 03 , 2024 | 12:10 AM