Share News

బంగారు ఆభరణాల రికవరీ

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:04 AM

ఇబ్రహీంపట్నం టౌన్‌ మంచాల రోడ్డులో పోగొట్టుకున్న మూడు తులాల బంగారు ఆభరణాలను సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా మంగళవారం పోలీసులు ఓ వ్యక్తి నుంచి రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన చిన్నముల ఉష.. భర్త మధుసూదన్‌రెడ్డితో కలిసి మూడు తులాల బంగారం గొలుసు, చెవి కమ్మల మరమ్మతు కోసమని సోమవారం కారులో ఇబ్రహీంపట్నం వచ్చారు.

బంగారు ఆభరణాల రికవరీ

ఇబ్రహీంపట్నం, జూన్‌ 11: ఇబ్రహీంపట్నం టౌన్‌ మంచాల రోడ్డులో పోగొట్టుకున్న మూడు తులాల బంగారు ఆభరణాలను సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా మంగళవారం పోలీసులు ఓ వ్యక్తి నుంచి రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన చిన్నముల ఉష.. భర్త మధుసూదన్‌రెడ్డితో కలిసి మూడు తులాల బంగారం గొలుసు, చెవి కమ్మల మరమ్మతు కోసమని సోమవారం కారులో ఇబ్రహీంపట్నం వచ్చారు. మంచాల రోడ్డులో ఉన్న బంగారు దుకాణం వద్ద ఆగి చూసేసరికి ఆభరణాల సంచి ఎక్కడో పడిపోయినట్లు గుర్తించారు. దాంతో బాధితులు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేయగా.. మంచాల రోడ్డుపై పడి ఉన్న ఆభరణాల సంచి మున్సిపల్‌ కార్మికుడు కప్పరి శ్రీను తీసుకున్నట్ల్లుగా గుర్తించారు. ఈమేరకు అతడి నుంచి రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.

అపహరించిన సెల్‌ఫోన్‌..

యాచారం, జూన్‌11 : దొంగలు అపహరించిన సెల్‌ఫోన్‌ను హైదరాబాద్‌ గ్రీన్‌ఫార్మాసిటీ పోలీసులు రికవరీ చేసి బాధితుడికి మంగళవారం అందించారు. మండల పరిధిలోని తాటిపర్తికి చెందిన వెంకటేష్‌ సెల్‌ఫోన్‌ను ఇటీవల దొంగలు తస్కరించారు. బాదితుడు పోలీసులను ఆశ్రయించగా ఎస్సై ప్రసాద్‌ తన సిబ్బందితో కలిసి యాప్‌ ద్వారా దొంగ నుంచి ఫోన్‌ రికవరీ చేశారు. బాధితుడు పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు.

Updated Date - Jun 12 , 2024 | 08:54 AM