Share News

చేవెళ్లకు రంజిత్‌.. మల్కాజిగిరికి సునీత

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:04 AM

రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల కీలక జాబితా ఎట్టకేలకు విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 57 మందితో కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేయగా.. తెలంగాణలోని మరో 5 స్థానాలకు అభ్యర్థులను గురువారం ప్రకటించింది.

చేవెళ్లకు రంజిత్‌.. మల్కాజిగిరికి సునీత

లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల ఖరారు .. జాబితా విడుదల చేసిన కాంగ్రెస్‌

రంగారెడ్డి అర్బన్‌, మార్చి 21 : రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల కీలక జాబితా ఎట్టకేలకు విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 57 మందితో కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేయగా.. తెలంగాణలోని మరో 5 స్థానాలకు అభ్యర్థులను గురువారం ప్రకటించింది. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. అలాగే మల్కాజిగిరి నుంచి వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. కాగా, చేవెళ్ల పార్లమెంట్‌ టికెట్‌ కోసం ఈ ఇరువురూ పోటీపడ్డారు. టికెట్‌ ఆశించిన వారిద్దరూ బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరారు. అయితే, వారిద్దరిలో టికెట్‌ ఎవరికి ఇవ్వాలనే విషయంపై గందరగోళ పరిస్థితులు ఏర్పడగా.. చివరకు చేవెళ్ల ఎంపీ టికెట్‌ రంజిత్‌రెడ్డికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ సునీతా మహేందర్‌రెడ్డికి కట్టబెట్టింది. కాగా, ముందు నుంచీ ‘ఆంధ్రజ్యోతి’ చెప్పినట్టుగానే చేవెళ్ల, మల్కాజిగిరి టికెట్లు రంజిత్‌రెడ్డి, సునీతారెడ్డికి దక్కాయి.

Updated Date - Mar 22 , 2024 | 12:04 AM