Share News

రామేశ్వర వీరాంజనేయ క్షేత్రంలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

ABN , Publish Date - Mar 20 , 2024 | 11:54 PM

మండలంలోని అన్మా్‌సపల్లిలో రామేశ్వరవీరాంజనేయ క్షేత్రంలో నూతనంగా నిర్మించిన ఆలయాల్లో బుధవారం విగ్రహ ప్రతిష్ఠ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు.

రామేశ్వర వీరాంజనేయ క్షేత్రంలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ
పూజలు నిర్వహిస్తున్న మాధవానంద సరస్వతి

అన్మా్‌సపల్లిలో సీతారాములు, శివపార్వతులు, సరస్వతీదేవిల విగ్రహాల ప్రతిష్ఠ

ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి

కడ్తాల్‌, మార్చి 20 : మండలంలోని అన్మా్‌సపల్లిలో రామేశ్వరవీరాంజనేయ క్షేత్రంలో నూతనంగా నిర్మించిన ఆలయాల్లో బుధవారం విగ్రహ ప్రతిష్ఠ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు, కౌన్సిల్‌ ఫర్‌గ్రీన్‌ రెవల్యూషన్‌ చైర్మన్‌ కోర్పోలు లీలాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా తొగుట గురు మాధనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద స్వామి, సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి ఎనుముల గీతారెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, కల్వకుర్తి, బోధన్‌, పాలకుర్తి ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, మామిడాల యశస్వినిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ప్రముఖ ఉపన్యాసకులు కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, పిరమిడ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేదపండితులు మెళ్లూరి వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం వరకు వేడుకలు కొనసాగాయి. కార్యక్రమంలో పతంజలి ఆశ్రమం సాధ్వి నిర్మలానంద భారతి, జడ్పీ వైస్‌చైర్మన్‌ బాలాజీసింగ్‌, పీసీసీ కార్యదర్శి రాంరెడ్డి, ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, జడ్పీటీసీలు దశరథ్‌నాయక్‌, విజితారెడ్డి, భరత్‌ప్రసాద్‌, నాయకులు/ప్రజాప్రతినిధులు గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, బిక్యానాయక్‌, ఆనంద్‌, శంకర్‌, ఎస్‌.శ్రీనివా్‌సరెడ్డి, లక్ష్మమ్మ, అరవింద్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పద్మారెడ్డి, దిలీ్‌పరెడ్డి, రవీందర్‌, ఆసి్‌ఫఅలీ, సుధీర్‌రెడ్డి, స్వదీ్‌పరెడ్డి, పాపిరెడ్డి, నవీన్‌రెడ్డి, నర్సింహ, బిచ్యానాయక్‌, జోగు వీరయ్య పాల్గొన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

దైవ కార్యక్రమాలు శాంతికి దోహదపడతాయని సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండేలా భగవంతుడు అనుగ్రహించాలని కోరుకున్నట్టు చెప్పారు. పూజల అనంతరం ఆమె చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో మాట్లాడుతూ ప్రకృతి సహకరించి, దేవుడు అనుగ్రహించి సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతానికి తమ పెదనాన్న దివంగత సూదిని జైపాల్‌రెడ్డి అందించిన సేవలు మరువలేనివని గీతారెడ్డి అన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలకు సాగునీరందించేలా సీఎం చొరవ తీసుకుంటున్నారని ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, యశస్వినిరెడ్డి అన్నారు.

సంస్కృతీ సంప్రదాయాలే భారతీయుల వారసత్వం

దేశ సంస్కృతీ సంప్రదాయాలే మన వారసత్వ సంపద అని, వాటిని పరిరక్షించుకోవాలని మధవానంద సరస్వతి అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజశాంతి చేకూరుతుందన్నారు. దేవుడు ఎక్కడున్నాడో ప్రతీ మనిషి అనుభవానికొస్తేనే తెలుస్తుందన్నారు. సన్మామార్గంలో పయనించే వారికి దైవానుగ్రహం ప్రాప్తిస్తుందని స్వామిజీ అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం లీలాలక్ష్మారెడ్డి చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. వందేమాతరం ఫౌండేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌ మాట్లాడుతూ అక్షరమే అంతరాలను తొలగిస్తుందన్నారు.

బైర్ఖాన్‌పల్లిలో రథోత్సవం

కేశంపేట: బైర్ఖాన్‌పల్లిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజూమున రథోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో రథాన్ని ఊరేగించారు. లక్ష్మీనరసింహ స్వామి నామస్మరణతో గ్రామం మర్మోగింది. కార్యక్రమంలో ఎంపీటీసీ సురే్‌షరెడ్డి, మాజీ సర్పంచ్‌లు రూప్లానాయక్‌, రాఘవేందర్‌రావు, శశివర్థన్‌రెడ్డి, యాదగిరిచారి, అంజయ్య, కుమార్‌, వెంకటేష్‌, హరిచందర్‌, గణేష్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2024 | 11:54 PM