పది ఎకరాల్లోపు ఉన్నవారికే ‘రైతు భరోసా’ వర్తింపజేయాలి
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:21 AM
పది ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం మండల సహకార సంఘం చైర్మన్ డి.చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
కందుకూరు, జూలై 2: పది ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం మండల సహకార సంఘం చైర్మన్ డి.చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. 20 ఎకరాల వరకు పంట సాగుచేసే రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని లేమూరు రైతులు రాణాప్రతా్‌పరెడ్డి, ఎలుక మేఘనాథ్‌రెడ్డిలు తెలిపారు. గ్రామాల్లో పామ్‌ల్యాండ్ ప్లాట్లుగా మార్చిన భూములకు, గుట్టలు, రాళ్లు ఉన్న భూములను సాయం వర్తింపజేయరాదని నేదునూరు రైతు జి.సురేందర్‌రెడ్డి తెలిపారు. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కందుకూరు, తిమ్మాపురం రైతులు దేశం కృష్ణారెడ్డి, గంగాపురం గోపాల్‌రెడ్డిలు కోరారు. రైతుల సూచనలు, సలహాలను జిల్లా సహకార సంఘం పాలక వర్గం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మహేశ్వరం ఏడీఏ సుజాత, మండల సహకార సంఘం చైర్మన్ డి.చంద్రశేఖర్‌లు తెలిపారు. ఎంపీపీ జ్యోతి, వైస్ ఎంపీపీ శమంతప్రభాకర్‌రెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ జి.విజయేందర్‌రెడ్డి, డైరెక్టర్లు శేఖర్‌రెడ్డి, నర్సింహ, జి.పర్వతాలు, జి.అంజమ్మ, జి.వెంకటే ష్, కె.యశోద, వెంకటరామిరెడ్డి, పాండురంగారెడ్డి, పొట్టి ఆనంద్, ఎంపీటీసీలు కాకి రాములు, బి.మల్లేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.