Share News

‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయాలి

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:12 AM

రైతు భరోసా పథకం కింద రైతులకు అందించే నిధులను తక్షణమే విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని సీపీఐ కాలనీ ఫేస్‌-2లో చేవెళ్ల పార్టీ మండల సహాయ కార్యదర్శి ఎండీ మక్బూల్‌ అధ్యక్షతన మండల కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు.

‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయాలి
మాట్లాడుతున్న జంగయ్య

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య

చేవెళ్ల, జూన్‌ 11 : రైతు భరోసా పథకం కింద రైతులకు అందించే నిధులను తక్షణమే విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని సీపీఐ కాలనీ ఫేస్‌-2లో చేవెళ్ల పార్టీ మండల సహాయ కార్యదర్శి ఎండీ మక్బూల్‌ అధ్యక్షతన మండల కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలను అందజేయాలని, ఆ నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో ఉన్న సర్వేనెంబర్‌ 75లో గత 16 నెలలుగా పేదలు గుడిసెలు వేసుకున్నారని, ప్రభుత్వం స్పందించి ఇళ్లులేని వారికి ఇంటి పట్టాలు అందించి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు రామస్వామి, జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి వడ్ల సత్యనారాయణచారి, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు అంజయ్య, మండల మహిళా అధ్యక్షురాలు లలిత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 08:19 AM